Hyderabad Realty: ఆకాశమే హద్దుగా కొత్త ఇళ్ల లాంచింగ్స్‌...! హైదరాబాద్‌ జోరు మాత్రం తగ్గేదేలే..!

29 Jan, 2022 05:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొత్త గృహాల ప్రారంభంలో హైదరాబాద్‌ జోరు కొనసాగుతోంది. 2021 నాల్గో త్రైమాసికం (అక్టోబర్‌ – డిసెంబర్‌)లో లాంచింగ్స్‌ లో హైదరాబాద్‌ తొలి స్థానంలో నిలిచిందని జేఎల్‌ఎల్‌ రెసిడెన్షియల్‌ మార్కెట్‌ రిపోర్ట్‌ వెల్లడించింది. అంతకుక్రితం త్రైమాసికంతో పోలిస్తే క్యూ4లో లాంచింగ్స్‌లో 26.1 శాతం వృద్ధి నమోదు కాగా.. పుణేలో 17.6 శాతం, బెంగళూరులో 16.4 శాతం, ముంబైలో 16.1% పెరుగుదల కనిపించిందని వివరించింది. నగరంలో గృహాల అమ్మకాలు కరోనా ముందస్తు స్థాయికి చేరుకున్నాయి.

2019లో 15,805 ఇళ్లు విక్రయం కాగా 2020లో 9,926, 2021లో 15,787 యూనిట్లు అమ్ముడుపోయాయి. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ పెరగడం, రియల్టీ మార్కెట్‌ సెం టిమెంట్‌ బలపడటం, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడు తుండటంతో డెవలపర్లు కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారం భం వైపు దృష్టిసారిస్తున్నారు. దేశంలోని ఏడు ప్రధా న నగరాలలో 2021 నాల్గో త్రైమాసికంలో 45,383 అపార్ట్‌మెంట్లు లాంచింగ్‌ అయ్యాయి. క్యూ3తో పో లిస్తే ఇది 38% ఎక్కువ. ఇందులో 19 % యూనిట్లు పుణేలో ప్రారంభం కాగా.. బెంగళూరు, హైదరాబాద్‌ ఒక్కోటి 17% వాటాను కలిగి ఉన్నాయి. 

మరిన్ని వార్తలు