Sakshi News home page

భారత్ వృద్ధి మరింత పైకి.. డెలాయిట్‌ ఇండియా

Published Fri, Jul 28 2023 7:36 AM

Indias growth up to 6.3 percent - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) 6 నుంచి 6.3 శాతం వరకూ పురోగమిస్తుందని డెలాయిట్‌ ఇండియా తన తాజా ఎకనమిక్‌ అవుట్‌లుక్‌లో పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితి తీవ్రత తగ్గితే వచ్చే రెండేళ్లలో 7 శాతం వరకూ కూడా వృద్ధి పురోగమించే అవకాశం ఉందని అంచనావేసింది. ప్రస్తుతం తీవ్ర అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితిలోనూ భారత్‌ ఎకానమీ పటిష్ట పనితీరును ప్రదర్శిస్తున్నట్లు వివరించింది.

ఇదీ చదవండిప్రపంచంలో టాప్‌ రిచెస్ట్‌ రాయల్‌ ఫ్యామిలీ ఏదో తెలుసా? 

అర్బన్‌ డిమాండ్‌సహా దేశీయంగా ఆటోమొబైల్, యూపీఐ లావాదేవీలు, దేశీయ విమాన ప్రకాణాలు, ట్రాక్టర్‌ అమ్మకాలు, ఐఐపీ నాన్‌–డ్యూరబుల్‌ గూడ్స్, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ గణాంకాలు.. పూర్తి సానుకూలంగా ఉన్నట్లు వివరించింది.   (ఫెడ్‌ సంచలన నిర్ణయం: భారతీయ ఐటీకి ముప్పే?)

Advertisement
Advertisement