Sakshi News home page

ప్రపంచవ్యాప్తంగా మొరాయిస్తున్న ఇన్‌స్టాగ్రామ్

Published Mon, Dec 21 2020 2:04 PM

Instagram down from Friday - Sakshi

న్యూఢిల్లీ, సాక్షి: సోషల్‌ మీడియా అప్లికేషన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ కొద్ది రోజులుగా మొరాయిస్తోంది. దేశీయంగానూ సమస్యలు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. బగ్‌ కారణంగా ఇలా జరుగుతూ ఉండవచ్చని టెక్‌ నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా పలువురు యూజర్లు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను వినియోగించడంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకూ ఈ అంశంపై ఇన్‌స్టాగ్రామ్‌ స్పందించకపోవడం గమనార్హం! రెండు రోజులుగా సమస్యలు ఎదురవుతున్నప్పటికీ పరిష్కారం ఎప్పుడన్న అంశాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వెల్లడించకపోవడంపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్తువెత్తుతున్నట్లు టెక్ వర్గాలు పేర్కొంటున్నాయి. 

శుక్రవారం నుంచీ
డౌన్‌డిటెక్టర్‌ డేటా ప్రకారం శుక్రవారం సాయంత్రం 3 గంటల నుంచీ ఇన్‌స్టాగ్రామ్‌ సాంకేతిక సమస్యలపై 800 రిపోర్ట్స్‌ నమోదయ్యాయి. ఇన్‌స్టాగ్రామ్‌ ఓపెన్‌ కాకపోవడంపై సుమారు 5 గంటల ప్రాంతంలో ప్రారంభమైన ఫిర్యాదులు 8 గంటలకల్లా భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. కాగా.. ఇటీవల గూగుల్‌ సంబంధిత ప్లాట్‌ఫామ్స్‌ సైతం సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్న నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యత పెరిగినట్లు టెక్‌ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో గత సోమవారం యూట్యూబ్‌, గూగుల్‌, జీమెయిల్‌, గూగుల్‌ డాక్స్‌ తదతర యాప్స్‌ వినియోగంలో అటు ఫోన్లు, ఇటు కంప్యూటర్లలో ఇబ్బందులు తలెత్తిన విషయం విదితమే. 

కొత్త ఫీచర్స్‌
ఇన్‌స్టాగ్రామ్‌ ఇటీవల రెండు కొత్త ఫీచర్స్‌ను జత చేసుకుంది. కోవిడ్‌-19పై యూజర్లకు తగిన సమాచారాన్నిఅందించేందుకు వీలుగా వీటిని అభివృద్ధి చేసింది. వైరస్‌ కేసులు పెరుగుతున్న ప్రాంతాలలో లింక్‌ ద్వారా స్థానిక ఆరోగ్య అధికారిక సంస్థకు సంబంధించిన వివరాలను అందిస్తోంది. వ్యాక్సినేషన్ల సమాచారం, తదితర వివరాలు తెలుసుకునేందుకు దారి చూపుతోంది. అంతేకాకుండా వెర్జ్‌ వివరాల ప్రకారం వ్యాక్సిన్లకు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని బ్లాక్‌ చేసేందుకూ తాజా ఫీచర్స్‌ను రూపొందించింది. 

Advertisement
Advertisement