Sakshi News home page

చమరు ధరలపై అంతర్జాతీయ ఇంధన సంస్థ కీలక వ్యాఖ్యలు..!

Published Fri, Mar 18 2022 6:29 PM

The International Energy Agency Has A 10 Point Plan To Cut Oil Use - Sakshi

గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా తన దాడులను కొనసాగిస్తోంది. అయితే, ఈ ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న దాడుల వల్ల అంతర్జాతీయంగా చమరు ధరలు భారీగా పెరుగుతున్నాయి. పెరుగుతున్న చమరు ధరల వల్ల అనేక దేశాల ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఇలాంటి కఠిన సమయంలో అంతర్జాతీయ ఇంధన సంస్థ ఇంధన ధరలపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. పెరుగుతున్న ధరలను తాత్కాలికంగా తగ్గించుకోవడం కోసం 10 పాయింట్ల ప్రణాళికను సూచించింది. ప్రపంచ చమురు మార్కెట్'లో రష్యా మూడవ అతిపెద్ద ఉత్పత్తిదారుడిగా మాత్రమే కాకుండా అతిపెద్ద ఎగుమతిదారుగా ఉంది. 

ప్రస్తుత పరిస్థితుల వల్ల ఇప్పుడు ఆ ప్రభావం అనేక దేశాల మీద అధికంగా ఉంది. ఆర్థిక నష్టాన్ని తగ్గించడానికి ఉన్న ఒక కీలక మార్గం చమురు డిమాండ్'ను తగ్గించడం అని అంతర్జాతీయ ఇంధన సంస్థ తెలిపింది. తాము సూచించిన 10 పాయింట్ల ప్రణాళిక వల్ల కొంత మేరకు ధరల పెరుగుదల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది. అయితే, ఈ 10 పాయింట్ల ప్రణాళిక అమలకు అనేక దేశాల ప్రభుత్వ మద్దతు అవసరం అని పేర్కొంది. ఈ ప్రణాళిక అమలు అనేది ప్రతి దేశ ఇంధన మార్కెట్లు, రవాణా మౌలిక సదుపాయాలు, సామాజిక & రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాల మీద ఆధారపడుతుంది అని తెలిపింది.

10 పాయింట్ల ప్రణాళికలోని ముఖ్య అంశాలు:

  • ప్రస్తుతం హైవేలపై ఉన్న వేగ పరిమితిని గంటకు కనీసం 10 కిలోమీటర్ల వేగం తగ్గించాలి. దీని వల్ల కార్లు వినియోగించే ఆయిల్ వినియోగం సుమారు 290 కేబీ/డీ ఆదా అవుతుంది, ట్రక్కులు వినియోగించే ఆయిల్ వినియోగం 140 కేబీ/డీ ఆదా అవుతుంది. కేబీ/డీ అంటే రోజుకు వెయ్యి బ్యారెల్స్ ఆయిల్ అని అర్ధం.
  • వారానికి మూడు రోజులు ఇంటి నుంచి పని చేయడం వల్ల ఒక రోజు సుమారు 170 కేబీ/డీ ఆయిల్ వినియోగం ఆదా అవుతుంది. అంటే, మూడు రోజులు కలిపి సుమారు 500 కేబీ/డీ ఆదా కానుంది. 
  • ప్రతి ఆదివారం నగర రోడ్ల మీద కార్లను అనుమతి ఇవ్వకూడదు. దీనివల్ల ప్రతి ఆదివారం సుమారు 380 కేబీ/డీ ఆదా అవుతుంది; నెలకు ఒక ఆదివారం 1520 కేబీ/డీ ఆదా చేస్తుంది.
  • ప్రజా రవాణాను, మైక్రోమొబిలిటీ, వాకింగ్, సైక్లింగ్ ప్రోత్సహించడం వల్ల సుమారు 330 కేబీ/డీ ఆదా చేస్తుంది.
  • పెద్ద నగరాల్లో ఎక్కువగా ప్రత్యామ్నాయ ప్రైవేట్ కారు యాక్సెస్ పెంచడం వల్ల సుమారు 210 కేబీ/డీ ఇంధనం ఆదా అవుతుంది.
  • కారు షేరింగ్ విధానాలను ప్రోత్సహించడం వల్ల సుమారు 470 కేబీ/డీ ఇంధనం ఆదా అవుతుంది. 
  • సరుకు రవాణా ట్రక్కుల కోసం సమర్థవంతమైన డ్రైవింగ్ & గూడ్స్ డెలివరీని ప్రోత్సహించడం వల్ల సుమారు 320 కేబీ/డీ ఇంధనం ఆదా అవుతుంది.
  • సాధ్యమైనంత వరకు విమానాలకు బదులుగా హై స్పీడ్, నైట్ రైళ్లను వినియోగించడం వల్ల సుమారు 40 కేబీ/డీ ఇంధనం ఆదా అవుతుంది.
  • ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్న చోట వ్యాపార విమాన ప్రయాణాన్ని చేపట్టక పోవడం వల్ల సుమారు 260 కేబీ/డీ ఇంధనం ఆదా అవుతుంది.
  • ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలను ప్రోత్సహించడం వల్ల సుమారు 100 కేబీ/డీ ఇంధనం ఆదా అవుతుంది.

(చదవండి: దేశంలో చౌక గృహాలకు తగ్గిన డిమాండ్..!)

Advertisement

What’s your opinion

Advertisement