ఐటీ ఉద్యోగులు ఇళ్లు కొనాలంటే.. | Sakshi
Sakshi News home page

ఐటీ ఉద్యోగులు ఇళ్లు కొనాలంటే..

Published Sat, Dec 11 2021 3:44 PM

IT Employees Are The Major Buyers For Newly Constructed Homes - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కమర్షియల్, రెసిడెన్షియల్‌ రియల్‌ ఎస్టేట్‌ ఏదైనా సరే ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) కంపెనీలు, ఉద్యోగుల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. టెకీల వేతనాలు, వాళ్ల అభిరుచులను అర్థం చేసుకొని, అందుకు తగ్గట్టు ప్రాజెక్ట్‌లను డిజైన్‌ చేయగలిగితే చాలు... ప్రాజెక్ట్‌లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతాయి. ఇదే ఫార్ములాను ఫాలో అవుతోంది ఏపీఆర్‌ గ్రూప్‌. ఏ ప్రాంతంలో ప్రాజెక్ట్‌ చేసినా సరే 95 శాతం కస్టమర్లు ఐటీ ఉద్యోగులే ఉంటారని కంపెనీ డైరెక్టర్‌ సంజీవ్‌ రెడ్డి తెలిపారు.

ఐటీ వాళ్లే అధికం
ఇప్పటివరకు 2,160 యూనిట్లను విక్రయించగా.. 1,800 మంది ఐటీ ఉద్యోగులే కొనుగోలు చేశారని చెప్పారు. రూ.కోటి నుంచి రూ.2 కోట్ల మధ్య ధర ఉండే విల్లా ప్రాజెక్ట్‌లను ఎక్కువగా కొనుగోళ్లు చేస్తారని తెలిపారు. ఏ ప్రాజెక్ట్‌ను చేపట్టినా సరే మొదటి 5 నెలల్లో ప్రాజెక్ట్‌లో వసతులను అందుబాటులోకి తీసుకొస్తాం. దీంతో కొనుగోలుదారులు వెంటనే వసతులను వినియోగించుకోవచ్చు.

కొత్త ప్రాజెక్టులు
 - ప్రస్తుతం ఏపీఆర్‌ గ్రూప్‌ మల్లంపేటలో సిగ్నేటర్‌ విల్లా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. 10 ఎకరాలలో మొత్తం 150 లగ్జరీ విల్లాలుంటాయి. ఒక్కో విల్లా 150 నుంచి 200 గజాల విస్తీర్ణంలో ఉంటుంది. 2,200 చ.అ. నుంచి 3 వేల చ.అ. మధ్య విల్లా బిల్టప్‌ ఏరియా ఉంటుంది. ధర రూ.1.3 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల మధ్య ఉంటుంది. 
- దుండిగల్‌లో హైనోరా పేరుతో మరో ప్రీమియం విల్లా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. 11 ఎకరాలలో 180 విల్లాలను నిర్మిస్తున్నాం. 150 నుంచి 200 గజాల విస్తీర్ణంలో ఒక్కో విల్లా ఉంటుంది. 2,200 చ.అ. నుంచి 3 వేల చ.అ. మధ్య విల్లా బిల్టప్‌ ఏరియా ఉంటుంది. రూ.1.3 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల మధ్య ధరలుంటాయి. 
 - పటాన్‌చెరులో గ్రాండియో విల్లా ప్రాజెక్ట్‌ ఉంది. ఇది 38 ఎకరాలు. ఇందులో 433 విల్లాలను నిర్మిస్తున్నాం. 150 నుంచి 200 గజాల విస్తీర్ణంలో 2,200 చ.అ. నుంచి 3 వేల చ.అ. మధ్య విల్లా బిల్టప్‌ ఏరియా ఉంటుంది. ధర రూ.1.3 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల మధ్య ఉంటుంది. ఇదే ప్రాంతంలో హైజీరియా పేరుతో అపార్ట్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ను కూడా నిర్మిస్తున్నాం. 7 ఎకరాలలో 10 అంతస్తులలో 720 యూనిట్లుంటాయి. 1,200 చ.అ. నుంచి 1,600 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలున్నాయి. ధర రూ.50 లక్షల నుంచి రూ.80 లక్షల మధ్య ఉన్నాయి. 
- వనస్థలిపురంలో క్రిస్టల్‌ పేరుతో లగ్జరీ విల్లా ప్రాజెక్ట్‌ను చేపడుతున్నాం. 10 ఎకరాలు 150 విల్లాలు. ధర రూ.1.5 కోట్ల నుంచి రూ.3 కోట్లు ఈ ప్రాజెక్ట్‌లో 60% కస్టమర్లు డాక్టర్లే ఉన్నారు. 

చదవండి: దక్షిణ భారత్‌లోనే అతి పెద్ద భవనం.. స్కైస్క్రాపర్లకు పెరిగిన డిమాండ్‌

Advertisement
Advertisement