జీతాల పెంపు: దిగ్గజ ఐటీ కంపెనీల ఉద్యోగులకు షాక్‌! 

4 Sep, 2023 13:21 IST|Sakshi

దేశీయ ఐటీ దిగ్గజాలు ఉద్యోగుల వేతనాల పెంపు విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు  తెలుస్తోంది. ఆదాయం, ఖర్చులు లాంటి పలు సవాళ్లను ఎదుర్కొంటున్న పలు ప్రముఖ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల జీతాల పెంపునకు సంబంధించి భిన్నమైన నిర్ణయాలు తీసుకున్నాయి. దీంతో ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌  ఉద్యోగులకు  తీవ్ర నిరాశ ఎదురు కానుంది. ఈమేరకు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఒక కథనాన్ని వెలువరించింది.

దీని ప్రకారం ఇన్ఫోసిస్,  HCLTech ఈసారి పెంపును నిలిపివేసినట్టు సమాచారం. సాధారణంగా ఇన్ఫోసిస్‌ జీతాల పెంపును జూన్/జూలైలో  ప్రకటించడం,అవి ఏప్రిల్ నుండి అమలు కావడం జరుగుతూ ఉంటుంది. అయితే హెచ్‌సిఎల్‌టెక్ మధ్య నుండి సీనియర్ ఉద్యోగులకు ఇంక్రిమెంట్‌లను దాటవేసిందట.అలాగే జూనియర్‌ స్థాయి ఉద్యోగుల జీతాల పెంపును వాయిదా వేసింది.  ఇన్ఫోసిస్ 023-24 ఆర్థిక సంవత్సరానికి గాను తన  వృద్ధి అంచనాను 4- 7శాతంనుంచి 1-3.5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. (ప్రౌడ్‌ ఫాదర్‌ జస్ప్రీత్ బుమ్రా నెట్‌వర్త్‌, లగ్జరీ కార్లు, ఈ వివరాలు తెలుసా?)

భిన్నంగా  టీసీఎస్‌,  విప్రో: ఉద్యోగులకు ఊరట
అయితే మరో టెక్‌ దిగ్గజం విప్రో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. మునుపటి సంవత్సరం సెప్టెంబర్‌తో పోల్చితే మూడవ త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్) ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంచనా. టెక్ మహీంద్రా జూనియర్ , మిడ్-లెవల్ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లను  ఇచ్చింది.  అయితే సీనియర్‌ల్లో పావు వంతు వాయిదా వేసింది. అటు మరో ఐటీ దిగ్గజం టీసీఎస్‌ కూడా గత ఏడాది మాదిరిగానే  తన ఉద్యోగులకు  ఊరటనిచ్చింది. వారికి 6-8శాతం వరకు సగటు పెంపును, అత్యుత్తమంగా పనిచేసిన వారికి రెండంకెల పెంపు ప్రకటించింది. టీసీఎస్‌తో పాటు మధ్యతరహా ఐటి సంస్థలైన  కోఫోర్జ్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ ఎల్‌టిఐ మైండ్‌ట్రీ తమ ఉద్యోగులకు జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించాయి.

మరిన్ని వార్తలు