నల్లగొండకి ఐటీ కాంతులు.. శుభవార్త చెప్పిన కేటీఆర్‌

31 Dec, 2021 08:45 IST|Sakshi

రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామరావు నూతన సంవత్సర కానుకగా నల​‍్లగొండ వాసులకు శుభవార్త తెలిపారు. ఐటీ రంగాన్ని ద్వితియ శ్రేణి పట్టణాలకు విస్తరించే కార్యక్రమంలో భాగంగా నల్లగొండలో ఐటీ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ నెలకొల్పబోతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు భవనం డిజైన్‌ ఎలా ఉంటుందనే అంశాన్ని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. 2021 డిసెంబరు 31న నల్లగొండ ఐటీ ఇంక్యుబేషన్‌ సెంటర్‌కి శంకుస్థాపన చేస్తున్నామని వెల్లడించారు. 18 నెలల్లో ఈ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ అందుబాటులోకి వస్తుందన్నారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడే వరంగల్‌కి ఐటీ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ మంజూరైంది. అయితే పనులు నత్తనడకన సాగాయి. తెలంగాణ వచ్చిన తర్వాత వరంగల్‌లో ఐటీకి మంచిరోజులు వచ్చాయి. సెయింట్‌, ఆనంద్‌ మహీంద్రా, మైండ్‌ట్రీ, ఎల్‌ అండ్‌ టీ వంటి సంస్థలు వరంగల్‌లో తమ క్యాంపస్‌లు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. ఇదే క్రమంలో ఆ తర్వాత కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌లలో కూడా ఐటీ ఇంక్యుబేషన్‌ సెంటర్లు ప్రారంభించగా ఫలితాలు సానుకూలంగా ఉన్నాయి. ఈ పరంపరలో నల్గొండకు సైతం ఐటీ సెక్టార్‌ చేరువకానుంది.

చదవండి:హైదరాబాద్‌తో ప్రేమలో పడకుండా ఉండగలమా... కేటీఆర్‌ ఆసక్తికర ట్వీట్‌

మరిన్ని వార్తలు