ఉక్రెయిన్-రష్యా ఎఫెక్ట్.. లబోదిబోమంటున్న బిలియనీర్స్! | Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్ - రష్యా వార్ ఎఫెక్ట్.. లబోదిబోమంటున్న బిలియనీర్స్!

Published Sun, Mar 6 2022 3:18 PM

Italy Seizes 156 million Dollars in Oligarchs Wealth, Pressing Putin - Sakshi

గత కొద్ది రోజుల నుంచి ఉక్రెయిన్ - రష్యా మధ్య యుద్దం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ యుద్దాన్ని నివారించడం కోసం చాలా దేశాలు అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికి ఈ యుద్దం ముగియడం లేదు. దీంతో యూరోపియన్ దేశాలు రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేత యుద్దాన్ని ఆపించేందుకు రష్యా దేశానికి చెందిన బిలియనీర్స్ మీద ఆంక్షలు విధించేందుకు సిద్దమయ్యాయి. దీంతో, చాలా మంది రష్యా బిలియనీర్స్ లబోదిబో అంటున్నారు.

మార్చి 4 నుంచి ఇటలీ ఆ దేశంలోని సార్డినియా, లిగురియన్ తీరం & లేక్ కోమోతో సహా ఇతర సుందరమైన ప్రదేశాలలో రష్యా దేశానికి చెందిన దనవంతులకు గల 143 మిలియన్ యూరోలు($156 మిలియన్లు) విలువైన లగ్జరీ యాచ్‌లు, విల్లాలను స్వాధీనం చేసుకుంది. "మొదట మేము ఉక్రెయిన్ మీద పుతిన్ దాడిని ఆపగలగాలి" అని ఇటాలియన్ విదేశాంగ మంత్రి లూయిగి డి మాయో ఇటాలియన్ స్టేట్ మీడియాకు చెప్పారు. ఇంకా, పుతిన్‌కు సన్నిహితంగా ఉండే దనవంతుల వర్గాలకు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ఇటలీ ప్రణాళికలను రచిస్తున్నట్లు తెలుస్తుంది. 

ఇటాలియన్ పోలీసులు శాన్ రెమో ఓడరేవులో పుతిన్‌కు దగ్గరగా ఉన్న జెన్నాడీ టిమ్చెంకో అనే వ్యక్తికి చెందిన సూపర్ యాచ్ "లీనా"ను వెంటనే స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 65 మిలియన్ యూరోలు ఉంటుందని అంచనా.  అలాగే టస్కానీ & కోమోలోని విల్లాలు కూడా ఉన్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. రష్యన్-ఉజ్బెక్ వ్యాపార దిగ్గజం అలిషర్ ఉస్మానోవ్'కు చెందిన విల్లాను ఉత్తర సార్డినియాలోని టోనీ ఎమరాల్డ్ తీరం వెంబడి స్వాధీనం చేసుకున్నారు. హాంబర్గ్ ఓడరేవులో ఉస్మానోవ్ పడవను స్వాధీనం చేసుకున్నట్లు వచ్చిన వార్తలను జర్మన్ అధికారులు ఖండించారు. 

జర్మనీ ఆర్థిక మంత్రిత్వ శాఖ "రష్యాపై మరిన్ని ఆంక్షలను వేగంగా అమలు చేసేందుకు" సిద్దం అవుతున్నట్లు పేర్కొంది. కానీ, ఆ దేశం ఏ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారో బహిరంగంగా చెప్పడానికి నిరాకరించింది. బిలియనీర్స్ స్వర్గధామం అయిన బ్రిటన్ దేశం రష్యాపై మరింత ఒత్తిడి చేయలని చూస్తుంది. ఫ్రాన్స్ దేశంతో సహ ఇతర అనేక యూరోప్ దేశాలు రష్యా ధనవంతులకు చెందిన ఆస్తులను స్వాదినం చేసుకోవాలని చూస్తున్నాయి.

(చదవండి: లీకైన ఆడియో టేపులు, వాటాల కోసం కొట్టుకుంటున్నారు?!)

Advertisement
Advertisement