Amazon CEO Jeff Bezos Has Announced That It Is Stepping Down From The Third Quarter - Sakshi
Sakshi News home page

అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ సంచలన నిర్ణయం

Published Wed, Feb 3 2021 10:55 AM

Jeff Bezos to Step Down as CEO of Amazon in Third Quarter - Sakshi

వాషింగ్టన్: ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈఓ జెఫ్ బెజోస్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది మూడో క్వార్టర్ నుంచి అమెజాన్ సీఈఓ పదవి నుంచి తాను తప్పుకోబోతున్నట్లు  ప్రకటించారు. కేవలం ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఉద్యోగులకు రాసిన లేఖలో 'అమెజాన్' అంటే ఒక ఆవిష్కరణ అని అన్నారు. జెఫ్ బెజోస్‌ స్థానంలో అమెజాన్‌ వెబ్‌ సర్వీస్‌ హెడ్‌ ఆండీ జెస్సీ తదుపరి సీఈవోగా నియామకం కానున్నారు. ఆండీ జెస్సీ బయట ప్రపంచానికి అంతగా తెలియకపోవచ్చు కానీ అతను సంస్థలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు. జెస్సీ తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వెంటనే 1997లో అమెజాన్ కంపెనీలో చేరారు.(చదవండి: క్రిప్టో కరెన్సీ చరిత్రలో మరో సంచలనం!)

అమెజాన్ కంపెనీ వరుసగా క్వార్టర్స్ లో కూడా సంస్థ లాభాలను ఆర్జించడమే కాకుండా.. 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా సేల్స్ ను ఈ క్వార్టర్ లో నమోదు చేయడం విశేషం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ రిటైలర్‌గా మారడంతో నికర అమ్మకాలు 125.56 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. 57 ఏళ్ల బెజోస్ 27 సంవత్సరాల క్రితం 1994లో అమెజాస్‌ను స్థాపించారు. ఇంటర్నెట్‌లో పుస్తకాలు అమ్మెందుకు ఈ సంస్థను ప్రారంభించారు.

చిన్న సంస్థగా మొదలైన అమెజాన్ అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ దిగ్గజ సంస్థగా నిలిచింది. అంతేకాదు సంస్థతో పాటు బెజోస్ ఆస్తులు కూడా భారీగా పెరిగాయి. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ప్రస్తుతం అమెజాన్ ఆస్తుల విలువ 1.6 ట్రిలియన్ డాలర్లు. ప్రస్తుతం అమెజాన్ ఎర్త్ ఫండ్, బ్లూ ఆర్జిన్ స్పేస్‌షిప్, అమెజాన్ డే1 ఫండ్2పై ఆయన మరింత దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. (అమెజాన్‌ కొత్త సీఈఓ ప్రత్యేకతలేంటో తెలుసా?)

Advertisement
Advertisement