లగ్జరీ ఎస్టేట్‌ కొనుగోలు చేసిన జెఫ్‌ బెజోస్‌: ప్రియురాలి కోసమేనా?

11 Aug, 2023 14:03 IST|Sakshi

అమెజాన్‌ కో ఫౌండర్‌ జెఫ్ బెజోస్ మరోసారి వార్తల్లోకి వచ్చాడు.ఇప్పటికే భారీ ఆస్తులను సొంతం చేసుకున్న బెజోస్‌ ప్రపంచంలోనే మూడో కుబేరుడు  ఫ్లోరిడాలోని ప్రత్యేకమైన ఇండియన్ క్రీక్ ఐలాండ్‌లో  దాదాపు రూ.560  కోట్ల  (68 మిలియన్ల  డాలర్లు)  ఎస్టేట్‌ను కొనుగోలుకు అంగీకరించినట్టు  మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. రికార్డుల ప్రకారం దాదాపు 9,300 చదరపు అడుగుల (864 చదరపు మీటర్లు) విస్తీర్ణంలో ఉంది.

లారెన్ శాంచెజ్‌తో  చెట్టాపట్టాల్‌, రూ.560 కోట్ల ఇల్లు
ఇటీవల గర్ల్‌ఫ్రెండ్‌తో  లారెన్ శాంచెజ్‌తో  సందడి చేసిన జెఫ్‌ బెజోస్‌ తన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యానికి ఫ్లోరిడాలోని వాటర్ ఫ్రంట్ మాన్షన్‌ను జోడించడం   బిజినెస్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా నిలిచింది. 1965లో నిర్మించిన 2.8-acre (1.1హెక్టార్లు) మూడు పడకగదులప్రాపర్టీ  MTM స్టార్ ఇంటర్నేషనల్  పేరుతో ఉన్నట్టు రికార్డుల ప్రకారం తెలుస్తోంది.

ఈ ప్రాంతంలోని ఇతర కొనుగోళ్లపై దృష్టి పెట్టారని, ప్రస్తుతం కొనుగోలు చేసిన స్పెషల్‌ ఇండియన్ క్రీక్‌ను "బిలియనీర్ బంకర్" అని పిలుస్తారని పేరు  చెప్పడానికి ఇష్టపడని వ్యక్తి సమాచారం ద్వారా  తెలుస్తోందని బ్లూమ్‌ బర్గ్‌ రిపోర్ట్‌ చేసింది. బెజోస్‌తోపాటు, కార్ల్ ఇకాన్, టామ్ బ్రాడీ, జారెడ్ కుష్నర్, ఇవాంకా ట్రంప్ లాంటి టాప్‌ సెలబ్రిటీలకు కూడా ఇక్కడ ఇళ్లు ఉండట విశేషం. అయితే ఈ వార్తలపై వ్యాఖ్యానించేందుకు బెజోస్ ప్రతినిధి నిరాకరించారు.

ఇప్పటికే దిమ్మదిరిగే  ప్రాపర్టీలు
బెజోస్‌కు ఇప్పటికే  వాషింగ్టన్ డీసీలో 165 మిలియన్ల డాలర్ల విలువన తొమ్మిది ఎకరాల బెవర్లీ హిల్స్ మాన్షన్ , ఇంకా  మౌయ్‌లోని ఒక ఎస్టేట్‌తో సహా  పలు లగ్జరీ భవనాలు ఆయన సొంతం. అలాగే  మాన్‌హాటన్ ,సీటెల్‌లో  ఖరీదైన ఆస్తులు, టెక్సాస్‌లో 300,000 ఎకరాల  ల్యాండ్‌ ఉంది. ఇక్కడే బ్లూ ఆరిజిన్  న్యూ షెపర్డ్ రాకెట్‌కు ప్రయోగ కేంద్రం కొలువై ఉంది.

లగ్జరీ  ప్రాపర్టీలపై  మోజు
2021లో అమెజాన్‌ సీఈవోగా వైదొలగిన బెజెస్‌కు భార్య మెకెంజీ స్కాట్‌తో విడాకుల తరువాత సూపర్‌ లగ్జరీ ప్రాపర్టీలను సొంతం చేసుకోవడంపై మోజు పెరిగింది.  ముఖ్యంగా  ప్రపంచంలోని అత్యంత ఖరీదైన సూపర్‌యాచ్‌  కోరును  కొనుగోలు చేశారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం 163 బిలియన్ల డాలర్ల సంపదతో, ఈ ఐలాండ్‌ ఎస్టేట్‌లో అత్యంత సంపన్న నివాసి అవుతాడు. ఈ ద్వీపంలో కేవలం 40 నివాసాలు, ఒక కంట్రీ క్లబ్ . సొంత పోలీసు విభాగం గా ఉన్నాయి. 

మరిన్ని వార్తలు