4జీ డౌన్‌లోడ్ స్పీడ్‌లో సత్తా చాటిన జియో..!

9 Jul, 2021 19:44 IST|Sakshi

న్యూఢిల్లీ: టెలికాం రంగంలో రిలయన్స్‌ జియో మరోసారి తన సత్తా చాటింది. 4జీ నెట్‌వర్క్‌ డౌన్‌లోడింగ్‌ స్పీడ్‌ పరంగా మరోసారి జియో అగ్రస్థానంలో నిలిచింది. జూన్ నెలలో డౌన్‌లోడింగ్‌ స్పీడ్‌ విషయంలో ఇతర నెట్‌వర్క్‌ల కంటే సెకనుకు సరాసరి 21.9 ఎమ్‌బీపీఎస్‌ వేగంతో జియో నెట్‌వర్క్‌ అన్నింటి కంటే ముందు ఉంది. ఈ విషయాన్ని టెలికాం రెగ్యూలేటర్‌ ట్రాయ్‌ ఒక రిపోర్టులో తెలిపింది. అలాగే, వోడాఫోన్‌ ఐడియా అప్‌లోడింగ్‌ స్పీడ్‌ పరంగా ముందంజలో ఉంది. వోడాఫోన్‌ సుమారు  6.2 ఎమ్‌బీపీఎస్‌ అప్‌లోడ్ స్పీడ్‌ పరంగా ముందు అన్నింటితో పోలిస్తే ఉంది.

రిలయన్స్ జియో 4జీ నెట్‌వర్క్‌ వేగం మే నెలతో(20.7 ఎమ్‌బీపీఎస్‌) పోలిస్తే స్వల్పంగా పెరిగింది. ఇక దీని సమీప పోటీదారుడు వోడాఫోన్ ఐడియా(డౌన్‌లోడ్ వేగం 6.5 ఎమ్‌బీపీఎస్‌) కంటే మూడు రెట్లు ఎక్కువ.  టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఎయిర్‌టెల్ 4జీ డౌన్‌లోడ్ వేగం స్వల్పంగా పెరగింది. ఇప్పటికీ 5 ఎమ్‌బీపీఎస్‌ డౌన్‌లోడ్ వేగంతో కనిష్ట స్థాయిలో ఉంది. ట్రాయ్ ప్రకారం, వోడాఫోన్ ఐడియా మే నెలలో సగటున 6.2 ఎమ్‌బీపీఎస్‌ అప్‌లోడ్ వేగాన్ని కలిగి ఉంది. దాని తర్వాత రిలయన్స్ జియో 4.8 ఎమ్‌బీపీఎస్‌ వేగంతో, భారతి ఎయిర్‌టెల్ 3.9 ఎమ్‌బీపీఎస్‌తో ఉంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు