Sakshi News home page

ఐపీఎల్‌లో అదరగొట్టేస్తున్న రిలయన్స్‌.. ధోనీ రాకతో మారిన సీన్‌!

Published Tue, Apr 4 2023 6:36 PM

Jiocinema Sees Record 1.47 Billion Digital Views, 50 Million App Downloads  - Sakshi

దేశంలోనే అత్యంత విలువైన నమోదిత కంపెనీగా పేరొందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఐపీఎల్ విభాగంలో అదరగొట్టేస్తుంది. రిలయన్స్‌కు చెందిన ‘జియోసినిమా’ యాప్‌ రికార్డ్‌ స్థాయిలో వ్యూస్‌  సొంతం చేసుకున్నట్లు ఆ సంస్థ బ్రాడ్‌కాస్టింగ్‌ జాయింట్‌ వెంచర్‌ వయాకామ్‌ 18 ప్రకటించింది. 

శుక్రవారం నుంచి ఐపీఎల్‌ మ్యాచ్‌లు ప్రారంభం కాగా.. ఇప్పటి వరకు 1.47 బిలియన్ల వ్యూస్‌ (147 కోట్ల వ్యూస్‌) లభించాయి. ఏకంగా 5 కోట్ల (5మిలియన్లు) మంది యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారని  వయాకామ్‌ 18 తెలిపింది. గత వారం (శుక్రవారం- ఆదివారం)లో జియో సినిమా యాప్‌కు వచ్చిన వ్యూస్‌ మొత్తం మార్చి 26, 2022  నుండి మే 29, 2022  వరకు జరిగిన ఐపీఎల్‌ సీజన్‌ డిజిటల్‌ వ్యూస్‌ను దాటి సరికొత్త రికార్డ్‌లను నమోదు చేసినట్లు వయోకామ్‌ 18 పేర్కొంది. 

వయోకామ్‌ 18 ఐపీఎల్‌ రైట్స్‌
2023 నుంచి 2027 వరకు డిజిటల్‌ ప్రసార హక్కుల్ని వయోకామ్‌ 18 సంస్థ 2.89 బిలియన్‌ డాలర్లకు సొంతం చేసుకుంది. అంతకుముందు డిజిటల్‌ రైట్స్‌ను డిస్నీ దక్కించుకుంది. మరోవైపు వరల్డ్‌ రిచెస్ట్‌ క్రికెట్‌ లీగ్‌ ఐపీఎల్‌ టీవీ ప్రసార హక్కుల్ని డిస్నీకి చెందిన స్టార్‌ ఇండియా సొంతం చేసుకుంది. అయితే శుక్రవారం జరిగిన గుజరాత్‌ టైటాన్స్‌ - చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌కి 8.7 బిలియన్‌ మినిట్స్‌ను వీక్షించినట్లు తెలిపింది. అదే సమయంలో జియో సినిమా యాప్‌లో 16 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయని వయోకామ్‌ 18 స్పోర్ట్స్‌ సీఈవో అనిల్‌ జయరాజ్‌ తెలిపారు.

సాహో ధోనీ
ఫార్మాట్ ఏదైనా, మైదానం ఎక్కడైనా , ప్రత్యర్థి ఎవరైనా, ఏ రంగు బంతి అయినా రికార్డులు బ్రేక్ చేయడం ధోనీకి కొత్త కాదు. కానీ అతడు బ్యాటింగ్ చేస్తుంటే టీవీ రికార్డులు కూడా బ్రేక్ అవుతాయని మీకు తెలుసా? అవును నిజమే.

దాదాపు మూడేళ్ల విరామం తర్వాత చెన్నై చెపాక్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ - చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. అభిమానుల అంచనాలను అందుకుంటూ ఈ మ్యాచ్‌లో లక్నోపై 12 పరుగుల తేడాతో చెన్నై విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ధోనీ చివరి ఓవర్లో బ్యాటింగ్ కు వచ్చాడు. అతడు ఆడింది కేవలం మూడే మూడు బంతులు. అందులో తొలి రెండు బంతులను రెండు సిక్సర్లు బాది బౌలర్ల కళ్లు తేలేసేలా చేశాడు. 

ధోనీ బ్యాటింగ్‌కు వచ్చిన సమయంలో జియో సినిమాను ఏకంగా 1.7 కోట్ల మంది వీక్షించారు. ఇక ధోనీ బ్యాటింగ్‌కు వస్తుండగా జియో సినిమా వ్యూయర్ షిప్ ఒక్కసారిగా 30 లక్షలు పెరిగింది. గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ధోని బ్యాటింగ్‌ను లైవ్‌లో 1.6 కోట్ల వీక్షించారు. దీంతో వ్యూయర్‌ షిప్‌లో ధోనీ తన రికార్డ్‌లను తానే బ్రేక్‌ చేసినట్లైంది.

Advertisement

What’s your opinion

Advertisement