3 ఐపీవోలకు సెబీ గ్రీన్‌సిగ్నల్‌  | Sakshi
Sakshi News home page

3 ఐపీవోలకు సెబీ గ్రీన్‌సిగ్నల్‌ 

Published Thu, Dec 21 2023 9:26 AM

Jyoti CNC Automation BLS E Services  Popular Vehicles get SEBI approval to float IPOs - Sakshi

న్యూఢిల్లీ: క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా మూడు కంపెనీల లిస్టింగ్‌ ప్రణాళికలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. జాబితాలో జ్యోతి సీఎన్‌సీ ఆటోమేషన్, బీఎల్‌ఎస్‌ ఈసర్వీసెస్, పాప్యులర్‌ వెహికల్స్‌ చేరాయి. పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు ఈ మూడు కంపెనీలూ సెబీకి ఆగస్ట్‌– అక్టోబర్‌ మధ్య కాలంలో ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. తాజాగా అనుమతులు పొందాయి. వివరాలు చూద్దాం.. 

రూ. 1,000 కోట్లు 
ఐపీవోలో భాగంగా జ్యోతి సీఎన్‌సీ ఆటోమేషన్‌ రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేసే యోచనలో ఉంది. ప్రాస్పెక్టస్‌ ప్రకారం ఇష్యూ నిధులను రుణ చెల్లింపులు, దీర్ఘకాలిక వర్కింగ్‌ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా కంప్యూటర్‌ న్యూమరికల్‌ కంట్రోల్‌(సీఎన్‌సీ) మెషీన్లను తయారు చేస్తోంది. జ్యోతి సీఎన్‌సీ ఆటోమేషన్‌ విభిన్న రంగాల నుంచి కస్టమర్లను కలిగి ఉంది.   

2.41 కోట్ల షేర్లు 
పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా బీఎల్‌ఎస్‌ ఈ–సరీ్వసెస్‌ 2.41 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ప్రాస్పెక్టస్‌ ప్రకారం ఇష్యూ నిధులను టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను పటిష్టపరచుకోవడం, నూతన సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవడం, ప్రస్తుతమున్న ప్లాట్‌ఫామ్స్‌ను కన్సాలిడేట్‌ చేసుకోవడం తదితర కార్యకలాపాలకు వినియోగించనుంది. అంతేకాకుండా బీఎల్‌ఎస్‌ స్టోర్ల ఏర్పాటు, ఇతర సంస్థల కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు సైతం వెచ్చించనుంది. వీసా, కాన్సులర్‌ సర్వీసులందించే బీఎల్‌ఎస్‌ ఇంటర్నేషనల్‌ సరీ్వసెస్‌కు ఇది అనుబంధ కంపెనీ. 

రూ. 250 కోట్ల ఈక్విటీ 
ఆటోమోటివ్‌ డీలర్‌షిప్స్‌ కంపెనీ పాప్యులర్‌ వెహికల్స్‌ అండ్‌ సరీ్వసెస్‌ పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా రూ. 250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి అదనంగా మరో 1.42 కోట్ల షేర్లను బన్యన్‌ ట్రీ గ్రోత్‌ క్యాపిటల్‌–2 ఎల్‌ఎల్‌సీ విక్రయానికి ఉంచనుంది. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. ఆటో దిగ్గజాలు మారుతీ, హోండా, జేఎల్‌ఆర్‌ ప్యాసింజర్‌ వాహనాల డీలర్‌ షిప్స్‌ నిర్వహిస్తోంది. టాటా మోటార్స్‌ వాణిజ్య వాహన డీలర్‌ షిప్స్‌ను సైతం కలిగి ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement