Sakshi News home page

కష్టాలు భరించలేక ఆత్మహత్యాయత్నం.. నెలకు రూ.60 అందుకునే స్థాయి నుంచి వందల కోట్లు..

Published Sun, Sep 24 2023 3:54 PM

Kalpana Saroj Inspirational Success Story And Net Worth Details - Sakshi

Success Story Of Kalpana Saroj: చిన్నతనం నుంచే ఎన్నెన్నో కష్టాలు ఎదుర్కొని నేడు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన విజయవంతమైన వ్యాపారవేత్తల్లో ఒకరు 'కల్పనా సరోజ్' (Kalpana Saroj). 12 సంవత్సరాల వయసుకే పెళ్లి చేసుకుని అత్తింటి వేధింపులు పడలేక చనిపోవాలనుకున్న మహిళ ఈ రోజు వందల కోట్ల సామ్రాజ్యానికి అధినేత్రి. ఈమె గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

1961లో మహారాష్ట్రలోని అకోలాలోని రోపర్‌ఖేడా గ్రామంలో జన్మించిన 'కల్పనా సరోజ్' తండ్రి పోలీస్ కానిస్టేబుల్. ఈమెకు 12 సంవత్సరాల వయసులోనే పెళ్లి చేశారు. వివాహం తరువాత ఆమె భర్త కుటుంబంతో ముంబైలోని ఒక మురికివాడలో నివసించింది. అత్తింటి వేధింపులు ఎక్కువయ్యాయి. ఆ తరువాత భర్తను విడిచి పుట్టింటికి వెళ్ళింది.

కష్టాలు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసింది. అది కూడా విఫమైంది. ఆ తరువాత వారి బంధువుల ఇంట్లో ఉంటూ నెలకు రూ. 60 జీతానికి ఒక సంస్థలో చేరింది. ఆ తరువాత అదనంగా రూ. 100 సంపాదించడం ప్రారంభించింది. ఆ తరువాత పట్టు వదలకుండా నిరంతరం శ్రమిస్తూనే ఉంది.

ప్రభుత్వ సాయంతో రూ.50,000 పొంది సొంతంగా బొటిక్ ప్రారంభించింది. ఆ తరువాత KS ఫిల్మ్ ప్రొడక్షన్ అనే నిర్మాణ సంస్థను స్థాపించింది. పరిచయాలను ఏర్పరచుకోవడం ద్వారా, ఆమె రియల్ ఎస్టేట్ సంస్థను పెంచుకుంటూ 'కమానీ ట్యూబ్స్‌'ప్రారంభించింది.

ఇదీ చదవండి: పద్మజ కుమారి పర్మార్.. రాజవంశంలో పుట్టింది మరి.. అలాంటి బుద్ధులే వస్తాయి!

కమనీ ట్యూబ్స్..
ప్రారంభంలో కమనీ ట్యూబ్స్ గణనీయమైన నష్టాలను చవిచూసినప్పటికీ, కల్పనా సరోజ్ తెలివితేటలతో లాభాల బాట పట్టించింది. ప్రస్తుతం ఈ సంస్థ రూ.100 కోట్లకు పైగా ఆదాయం తెచ్చిపెడుతోంది. అంతే కాకుండా ఈమె ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ బెంగుళూరు బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌లో సభ్యురాలు కూడా.

కల్పనా సరోజ్ ఆస్తులు విలువ 112 మిలియన్ డాలర్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 930 కోట్లు కంటే ఎక్కువని సమాచారం. ఎన్నో కష్టనష్టాలు చవిచూసి మిలినియర్ స్థాయికి చేరి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచినా ఈమెను 'నిజమైన స్లమ్‌డాగ్ మిలియనీర్' అని పిలుస్తారు.

కల్పనా సరోజ్ 2013లో భారత అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ పొందింది. అంతే కాకుండా ఈమె భారతీయ మహిళా బ్యాంక్ డైరెక్టర్ల బోర్డులో ఒకరుగా ఉన్నారు. కేవలం రోజుకు రూ. 2 సంపాదించే స్థాయి నుంచి వందలమందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదిగింది అంటే నిజంగా చాలా గొప్ప విషయం. ఈమె ప్రతి మహిళకు ఆదర్శనీయమనే చెప్పాలి.

Advertisement

తప్పక చదవండి

Advertisement