ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం లెనోవో భారత మార్కెట్లలోకి సరికొత్త ట్యాబ్‌ను లాంచ్ చేసింది. లెనోవో ట్యాబ్ కె10మోడల్‌ను సోమవారం రోజున కంపెనీ విడుదల చేయగా...ఈ ట్యాబ్‌కు 7500ఎమ్‌ఎహెచ్ బ్యాటరీని అమర్చారు. 3జీబీ, 4జీబీ ర్యామ్ వేరియంట్లతో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. లెనోవో లాంచ్ చేసిన ట్యాబ్ కే 10 ధర కంపెనీ వెబ్‌సైట్ లో రూ. 25000గా ఉండగా...ఫెస్టివల్ సీజన్ నేపథ్యంలో అతి తక్కువ ధరకే అందించనున్నట్లు తెలుస్తోంది.
4జీబీ+64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16,999, కాగా 3జీబీ+32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,999 గా ఉంది. ఈ ట్యాబ్ ఆండ్రాయిడ్ 11 వోఎస్‌ను సపోర్ట్ చేయనుంది. అంతేకాకుండా రానున్న ఆండ్రాయిడ్ 12 వోఎస్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చునని లెనోవో పేర్కొంది.
చదవండి: జియో ఫోన్ సేల్స్ కోసం అదిరిపోయే బిజినెస్ మోడల్
లెనోవో ట్యాబ్ కే10 ఫీచర్స్
చదవండి: వారెవ్వా జియో..! అదిరిపోయే ఫీచర్లతో పాటు మరో సూపర్ అప్‌డేట్..!