మోసపూరిత ప్రకటనలతో జాగ్రత్త: ఎల్‌ఐసీ | Sakshi
Sakshi News home page

మోసపూరిత ప్రకటనలతో జాగ్రత్త: ఎల్‌ఐసీ

Published Thu, Apr 25 2024 5:17 PM

LIC cautions public against misleading social media - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: తమ సంస్థ పేరుతో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న మోసపూరిత ప్రకటనల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని  జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) హెచ్చ రించింది.

‘కంపెనీ సమ్మతి లేకుండా మా సీనియర్‌ అధికారి, మాజీ అధికారుల ఫొటోలు, లోగో, బ్రాండ్‌ పేరును దురి్వనియోగం చేయడం ద్వారా నిర్దిష్ట వ్యక్తులు/సంస్థలు వివిధ సామాజిక మాధ్యమాల్లో మోసపూరిత ప్రకటనల్లో అనధికార పద్ధతిలో నిమగ్నమై ఉన్నాయని మా దృష్టికి వచి్చంది. పాలసీదారులు, ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలి.  అటువంటి మోసపూరిత ప్రకటనల యూ ఆర్‌ఎల్‌ లింక్‌లను ఎల్‌ఐసీ అధికారిక సోషల్‌ మీడియా ఖాతాలలో నివేదించండి’ అని ఎల్‌ఐసీ కోరింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement