ఒక్కనెలలోనే రూ.12వేలకోట్ల ప్రీమియం వసూలు | Sakshi
Sakshi News home page

ఒక్కనెలలోనే రూ.12వేలకోట్ల ప్రీమియం వసూలు

Published Sat, May 11 2024 9:23 AM

LIC premiums collected high on April about Rs 12384 Crores

ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) ఒక్కనెలలోనే రూ.12,384 కోట్ల ప్రీమియం వసూలు చేసింది. 2014 తర్వాత నెలవారీ అధిక ప్రీమియం వసూలైనట్లు తెలిసింది.

2024 ఏప్రిల్‌ నెలకుగాను ఎల్‌ఐసీ సంస్థ రూ.12,384 కోట్ల ప్రీమియాన్ని వసూలు చేసినట్లు తెలిపింది. గత ఏడాది ఏప్రిల్‌లో వసూలైన రూ.5,810.10 కోట్ల ప్రీమియంతో పోలిస్తే ఇది 113.14% అధికంగా నమోదైంది. ఎల్‌ఐసీ వ్యక్తిగత ప్రీమియం విభాగంలో రూ.3,175.47 కోట్లను వసూలు చేసినట్లు లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ పేర్కొంది. 2023 ఇదే కాలంలోని రూ.2,537.02 కోట్లతో పోలిస్తే ఇది 25.17% ఎక్కువ. 

గ్రూప్‌ పాలసీల ప్రీమియం వసూళ్లు రూ.9,141.34 కోట్లుగా ఉన్నాయి. గత ఏప్రిల్‌లో రూ.3,239.72 కోట్లతో పోలిస్తే ఇది 182.16% అధికంగా ఉంది. ఎల్‌ఐసీ పాలసీదారుల నమ్మకాన్ని సంపాదించిందని అందువల్లే ఇలా పెద్ద మొత్తంలో ప్రీమియం వసూలైనట్లు సంస్థ వర్గాలు తెలిపాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement