కరోనా : తక్కువ ధరలో మరో ఫావిపిరవిర్ డ్రగ్ | Sakshi
Sakshi News home page

కరోనా : తక్కువ ధరలో మరో ఫావిపిరవిర్ డ్రగ్

Published Wed, Aug 5 2020 12:10 PM

   Lupin launches Favipiravir drug Covihalt for mild corona virus treatment - Sakshi

సాక్షి, ముంబై : ప్రముఖ ఫార్మా సంస్థ లుపిన్ కరోనా వైరస్ నివారణకు ప్రయోగాత్మక ఔషధంగా భావిస్తున్నఫావిపిరవిర్ డ్రగ్ లాంచ్ చేసింది. కోవిహాల్ట్ పేరుతో ఈ ఔషదాన్ని బుధవారం అందుబాటులోకి  తీసుకొచ్చినట్టు బుధవారం ప్రకటించింది. 200 మి.గ్రా టాబ్లెట్ ధరను 49 రూపాయలుగా నిర్ణయించింది.  (కరోనా వాక్సిన్: నోవావాక్స్ శుభవార్త )

తేలికపాటి నుండి మోడరేట్  లక్షణాలున్న  కోవిడ్-19 రోగుల్లో  చికిత్స కోసం కోవిహాల్ట్ బ్రాండ్ పేరుతో భారతదేశంలో తన ఫావిపిరవిర్‌ను ప్రారంభించినట్లు లుపిన్ వెల్లడించింది. ఇది 10 టాబ్లెట్ల స్ట్రిప్ రూపంలో లభిస్తుందని లుపిన్ ఇండియా రీజియన్ ఫార్ములేషన్స్ (ఐఆర్ఎఫ్) ప్రెసిడెంట్ రాజీవ్ సిబల్  తెలిపారు. తమ బలమైన నెట్ వర్క్ ద్వారా దేశవ్యాప్తంగా ఈ ఔషధాన్నిఅందుబాటులో తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.(కరోనాకు అతిచవక మందు వచ్చేసింది)

అత్యవసర వినియోగానికి ఫావిపిరవిర్ ఔషధానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) నుండి అనుమతి  పొందింది. ఫావిపిరవిర్‌ను మొదట జపాన్‌కు చెందిన ఫుజిఫిల్మ్ హోల్డింగ్స్ అవిగన్ బ్రాండ్ పేరుతో అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. దేశీయంగా దీని తయారీ,  విక్రయానికి  గ్లెన్ మార్క్, హెటెరో, సిప్లా, సన్ ఫార్మ  లాంటి దిగ్గజ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలను చేసుకుంది.

Advertisement
Advertisement