మహీంద్రా ఎక్స్​యూవీ 700 డిజైన్ అదుర్స్

1 Aug, 2021 16:26 IST|Sakshi

ప్రముఖ వాహన తయారీ సంస్థలు ఎస్​యూవీ సెగ్మెంట్​లో పోటాపోటీగా వాటి కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి. తాజాగా దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా & మహీంద్రా తర్వాతి తరం ఎక్స్​యూవీ 700 మోడల్ అడ్రెనోక్స్ 'ఇంటెలిజెంట్' వ్యవస్థను టీజ్ చేసింది. అయితే, ఈ వీడియోలో కొత్త ఎక్స్​యూవీ 700 డిజైన్ తో సహా ఇంటీరియర్లు, ఫీచర్లు వంటి కొన్ని కీలక వివరాలను వెల్లడించింది. మహీంద్రా కొత్త ఎక్స్​యూవీ డ్యాష్ బోర్డ్ చాలా విస్తారంగా ఉంది. మహీంద్రా ఎక్స్​యూవీ 700 యాడ్రినోక్స్ అనే కొత్త 'ఇంటెలిజెంట్' సిస్టమ్ ని తీసుకొచ్చింది. ఇది 'తెలివైనది' అని కంపెనీ పేర్కొంది. ఈ ఎక్స్​యూవీ 700 డిజైన్ చూడాటానికి టొయోటా ఫార్చునర్ లాగే ఉంది. 

ఇందులోని అడ్రెనోక్స్ 'ఇంటెలిజెంట్' సిస్టమ్ ద్వారా సన్ రూఫ్ తెరవడం, క్లోజ్ చేయడం వంటి ప్రాథమిక విధులను అలెక్సాతో ఇంటిగ్రేట్ చేయవచ్చు. స్క్రీన్లు (మిడ్, ఇన్ఫోటైన్ మెంట్) రెండూ ఒకే గ్లాస్ ప్యానెల్ లో ఉన్న విషయాన్ని కూడా టీజర్ ధృవీకరిస్తుంది. ఈ ఫీచర్ చాలా ఖరీదైన లగ్జరీ కార్లలో చూడవచ్చు. మధ్యలో ఉన్న సమాచారంతో పాటు రెండు చివరల్లో స్పీడోమీటర్, టాకోమీటర్ తో మిడ్ పూర్తిగా డిజిటల్ గా ఉంది. మహీంద్రా ఎక్స్​యూవీ 700 సోనీకి చెందిన 3డీ సౌండ్ ద్వారా పనిచేయనున్నట్లు తెలుస్తుంది. ఈ వీడియోలో ఫీచర్ల పరంగా కారుకు ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేకులు, డ్రైవ్ సెలక్టర్, విభిన్న డ్రైవ్ మోడ్ లు లభిస్తాయని తెలుస్తుంది. దీనిలో 'జిప్', 'జాప్'  'జూమ్' మోడ్లు ఉన్నాయి. మహీంద్రా ఎక్స్​యూవీ 700లో స్మార్ట్ డోర్ హ్యాండిల్స్ కూడా రానున్నాయి. ఇలాంటివి టెస్లా కార్లతో పాటు కొన్ని లగ్జరీ బ్రాండ్లలో ఉంటాయి.

మరిన్ని వార్తలు