‘ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేయొద్దనేది ఇందుకే’..కళ్లు బైర్లు కమ్మేలా | Man Orders Over Rs 1 Lakh Laptop From Flipkart; Do You Know What He Received - Sakshi
Sakshi News home page

‘ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేయొద్దనేది ఇందుకే’..కళ్లు బైర్లు కమ్మేలా

Published Sun, Jan 21 2024 12:23 PM

Man Orders Laptop Worth Over Rs 1 Lakh From Flipkart, Gets Old Laptop - Sakshi

ఆన్‌లైన్‌లో ల్యాప్‌ట్యాప్‌ కొనుగోలు చేసిన ఓ వినియోగదారుడికి ఫ్లిప్‌కార్ట్‌ ఝలక్‌ ఇచ్చింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యూజర్‌ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో రూ.1.13 లక్షల విలువైన ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేశాడు. బదులుగా ఫ్లిప్‌‌కార్ట్‌ తనకు పాత, డొక్కు ల్యాప్‌ట్యాప్‌ను పంపిందని వాపోయాడు. ఇలాంటి చేదు అనుభవాల్ని ఎదుర్కొన్నప్పుడే ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేయాలంటే బయపడాల్సి వస్తుందని అంటున్నాడు. 

‘రిపబ్లిక్ డే సేల్‌లో లక్షకు పై ధరలో ఫ్లిప్‌కార్ట్‌లో ఆసుస్‌ ల్యాప్‌టాప్‌ని ఆర్డర్ చేశాను. కానీ ఫ్లిప్‌కార్ట్‌ నాకు పాత ల్యాప్‌ట్యాప్‌ను పంపింది. అందుకే ఈకామర్స్‌  ప్లాట్‌ఫామ్స్‌ నుండి ఆర్డర్ చేసిన ప్రొడక్ట్‌లను నమ్మకండి అంటూ బాధితుడు సౌరో ముఖర్జీ వీడియోను ఎక్స్‌.కామ్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

సౌరౌ ముఖర్జీ జనవరి 13న రూ.1.13లక్షలు విలువ చేసే ల్యాప్‌ట్యాప్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశాడు. మరుసటి రోజే ల్యాప్‌ట్యాప్‌ చేతికి వచ్చింది. వెంటనే సౌరౌ తాను పార్శిల్‌ను ఓపెన్‌ చేస్తానని, వీడియో తీయాలని సదరు డెలివరీ బాయ్‌ను కోరాడు. 

చెప్పినట్లుగానే డెలివరీ బాయ్‌ పార్శిల్‌ను వీడియో తీస్తుంటే ముఖర్జీ దానిని ఓపెన్‌ చేసి చూస్తాడు. పార్శిల్‌ ఓపెన్‌ చేసిన అతనికి కళ్లు బైర్లు కమ్మేలా.. తాను ఖరీదైన ల్యాప్‌ట్యాప్‌ బుక్‌ చేస్తే..మట్టికొట్టుకుపోయిన పాత ల్యాప్‌ట్యాప్‌ వచ్చినట్లు గుర్తిస్తాడు. ల్యాప్‌ట్యాప్‌ ఓపెన్‌ చేసి నేను బ్లాక్ ల్యాప్‌టాప్‌ని ఆర్డర్ పెట్టాను’ అని ముఖర్జీ వీడియోలో చెబుతుంటే పక్కనే ఉన్న డెలివరీ ఏజెంట్‌ మాటకలుపుతూ ఇది ఉపయోగించిన ల్యాప్‌ట్యాప్‌లా ఉందని అని అంటున్న సంభాషణలు స్పష్టంగా వినపడుతున్నాయి.

  

ఇక ల్యాప్‌ట్యాప్‌ పార్శిల్‌ ఓపెన్‌ చేసిన అనంతరం ఆన్‌లైన్‌లో మీరు ఏదైనా వస్తువును కొనుగోలు చేస్తే ఇలా వీడియోలు తీసుకోవడం మంచిదని, నకిలి పార్శిళ్ల నుంచి సురక్షితంగా ఉంచేలా అవి మనల్ని కాపాడుతాయని అని అన్నాడు. 

ఇక తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఫ్లిప్‌ కార్ట్‌ ప్రతినిధులకు ఎక్స్‌.కామ్‌లో ట్యాగ్‌ చేశాడు. కొత్త ల్యాప్‌ట్యాప్‌ను కొనుగోలు చేసే పాత ల్యాప్‌ట్యాప్‌ను పంపారని మెసేజ్‌ చేయగా.. మీ అసౌకర్యానికి చింతిస్తున్నాం. సంబంధిత వివరాల్ని పంపమని మెసేజ్‌ చేసింది.  

Advertisement
Advertisement