విమానం... అయింది విల్లా!

18 Feb, 2024 14:13 IST|Sakshi

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉండే 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra).. తాజాగా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో మరో ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేశారు. ఇందులో ఒక విమానం అద్భుతమైన విల్లాగా మారిపోయి ఉండటం చూడవచ్చు.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఓ వ్యక్తి విమానాన్ని తనకు కావలసిన సకల సౌకర్యాలతో అద్భుతమైన నివాసంగా ఏర్పాటు చేసుకుని ఉండటం చూడవచ్చు. అందులోనే బెడ్ రూమ్, వాష్ రూమ్స్, కారిడార్ వంటి ప్రదేశాలు ఉన్నాయి. ఈ వీడియో షేర్ చేస్తూ కొందరు తమ కలలను నిజం చేసుకునే అదృష్టం కలిగి ఉంటారు. ఈ విమానం విల్లాలో బస చేసేందుకు తప్పకుండా ప్రయత్నిస్తానని ఆనంద్ మహీంద్రా క్యాప్షన్ ఇచ్చారు.

నిజానికి చాలామంది విమానంలో ప్రయాణించాలని కలలు కంటారు, అలాంటిది విమానాన్ని నివాసంగా ఏర్పాటు చేసుకున్నాడంటే.. ఆ వ్యక్తి ఎలా పొగడాలో కూడా అర్థం కావడం లేదంటూ కొందరు నెటిజన్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోకు ఇప్పటికే లక్షల వ్యూవ్స్, ఆరు వేలకంటే ఎక్కువ లైక్స్ వచ్చాయి. కొందరు నెటిజన్లు ఈ వీడియోపై తనదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫ్లైట్ విల్లా ఫెలిక్స్ డెమిన్ బాలిలోని న్యాంగ్ న్యాంగ్ బీచ్ సమీపంలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: ఇన్‌స్టా రీల్స్ చేస్తూ సూపర్ కారు కొనేశారు - ధర తెలిస్తే షాకవుతారు!

whatsapp channel

మరిన్ని వార్తలు