మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌- ర్యాలీ కంటిన్యూ | Sakshi
Sakshi News home page

మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌- ర్యాలీ కంటిన్యూ

Published Fri, Dec 11 2020 3:55 PM

Market bounce back from losses- rally restarts - Sakshi

ముంబై, సాక్షి: ఒక్క రోజు విరామం తదుపరి తిరిగి దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. అయితే మిడ్‌సెషన్‌లో ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకోవడంతో మార్కెట్లకు షాక్‌ తగిలింది. చివరికి కోలుకుని ప్రస్తావించదగ్గ లాభాలతో ముగిశాయి. వెరసి రికార్డుల ర్యాలీ తిరిగి ప్రారంభమైందని నిపుణులు పేర్కొన్నారు. సెన్సెక్స్‌ 139 పాయింట్లు పెరిగి 46,099 వద్ద నిలవగా.. నిఫ్టీ 36 పాయింట్లు పుంజుకుని13,514 వద్ద స్థిరపడింది. గత నెలలో ఉద్యోగ ఆఫర్లు పుంజుకోవడం, సహాయక ప్యాకేజీపై తిరిగి పెరిగిన ఆశల నేపథ్యంలో గురువారం యూఎస్‌ మార్కెట్లు కనిష్టాల నుంచి కోలుకుని మిశ్రమంగా ముగిశాయి. ఇటీవల జీడీపీ రికవరీ బాట పట్టడం, వ్యాక్సిన్ల అందుబాటుపై అంచనాలు దేశీయంగా సెంటిమెంటుకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా.. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 46,310 వద్ద గరిష్టాన్ని, 45,706 వద్ద కనిష్టాన్నీ తాకింది. నిఫ్టీ సైతం 13,579-13,403 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. 

ఫార్మా, ఐటీ వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ, బ్యాంకింగ్‌ రంగాలు 1 శాతం స్థాయిలో పుంజుకోగా.. ఫార్మా, ఐటీ 0.5 శాతం చొప్పున నీరసించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, గెయిల్‌, కోల్‌ ఇండియా, టాటా స్టీల్‌, ఐసీఐసీఐ, టైటన్‌, ఐవోసీ, ఐటీసీ, ఎస్‌బీఐ 5.4-1 శాతం మధ్య ఎగశాయి. అయితే యాక్సిస్‌, దివీస్‌, అదానీ పోర్ట్స్‌, ఎంఅండ్‌ఎం, ఐషర్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, యూపీఎల్‌, సిప్లా, టెక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ లైఫ్‌ 2.3-0.8 శాతం మధ్య డీలాపడ్డాయి. (లాజిస్టిక్స్‌ కంపెనీలకు వ్యాక్సిన్ల బూస్ట్‌)

అపోలో టైర్‌ అప్‌
డెరివేటివ్స్‌లో అపోలో టైర్స్‌, పీఎన్‌బీ, సెయిల్‌, ఆర్‌ఈసీ, జూబిలెంట్‌ ఫుడ్‌, ఐడియా, ఎన్‌ఎండీసీ 6.5-3 శాతం మధ్య జంప్‌ చేశాయి. కాగా.. మరోపక్క టీవీఎస్‌ మోటార్‌, పేజ్‌ ఇండస్ట్రీస్‌, నౌకరీ, పిరమల్‌, బీవోబీ, సన్‌ టీవీ, మ్యాక్స్‌ ఫైనాన్స్‌, వోల్టాస్‌ 3.3-1.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.2-0.5 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,749 లాభపడగా..1218 నష్టాలతో ముగిశాయి.

ఎఫ్‌ఫీఐల ఇన్వెస్ట్‌మెంట్స్
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,260 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా..  దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 2,275 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 3,564 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు రూ. 2,493 కోట్ల విలువైన అమ్మకాలు నిర్వహించాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 2,910 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. డీఐఐలు రూ. 2,641 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. 

Advertisement
Advertisement