Hyderabad based Marut Drones partners with UP government - Sakshi
Sakshi News home page

డ్రోన్లతో అటవీ భూమిలో 10 వేల సీడ్‌ బాల్స్‌.. మారుత్‌ డ్రోన్స్‌ ఒప్పందం

Published Sat, Jul 29 2023 10:19 AM

Marut Drones partners with UP govt aerial seeding - Sakshi

ఆగ్రా/ఫిరోజాబాద్‌: ’హరా బహారా’ నినాదం కింద అడవుల పెంపకం కార్యక్రమాన్ని విస్తృతం చేసేలా ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వంతో హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ కంపెనీ మారుత్‌ డ్రోన్స్‌ చేతులు కలిపింది. డ్రోన్ల ద్వారా ఆగ్రాకు సమీపంలో 10 ఎకరాల అటవీ భూమిలో 10,000 సీడ్‌ బాల్స్‌ను వెదజల్లింది.

తమ సీడ్‌కాప్టర్స్‌ ద్వారా 2030 నాటికి 100 కోట్ల మొక్కలు నాటాలని నిర్దేశించుకున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు ప్రేమ్‌ కుమార్‌ విస్లావత్‌ తెలిపారు. వృక్షారోపణ్‌ కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటే ప్రక్రియను నిర్వహించేందుకు ఔత్సాహిక ఎంట్రప్రెన్యూర్లు, డ్రోన్‌ టెక్నాలజీ తోడ్పడగలవని ఉత్తర్‌ప్రదేశ్‌ అటవీ శాఖ మంత్రి దారా సింగ్‌ చౌహాన్‌ తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement