వరల్డ్‌ ఫాస్టెస్ట్‌ కారు కొన్న దిగ్గజ ఆటగాడు: రూ. 29 కోట్లు

25 May, 2023 11:46 IST|Sakshi

న్యూఢిల్లీ: బాస్కెట్‌ బాల్ దిగ్గజం, మాజీ ఎన్‌బీఏ స్టార్‌ మైఖేల్ జోర్డాన్‌ తన ఆసక్తికి తగ్గట్టుగానే మరో ఫాస్టెస్ట్‌ కారును సొంతం చేసుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, కన్వర్టిబుల్‌ కార్‌ హెన్నెస్సీ వెనమ్ F5 రోడస్టర్‌ను  కొనుగోలు చేశాడు  దీని  ఏకంగా రూ. 29 కోట్ల రూపాయలు.

బాస్కెట్‌బాల్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడైన జోర్డాన్‌  హైపర్‌, సూపర్‌, స్పోర్ట్స్  కార్ల కలెక్షన్‌కు పెట్టింది పేరు. అందులోనూ  అల్ట్రా-ఫాస్ట్ కార్లంటే అంటే అతనికి పిచ్చి. గంటకు 400 కి.మీ దూసుకుపోయే బుగట్టి వేరాన్ గ్రాండ్ స్పోర్ట్‌ కారు ఇప్పటికే  గ్యారేజీలో ఉంది. ఇంకా పోర్స్చే 911 టర్బో S 993, ఫెరారీ 512 TR , చేవ్రొలెట్ కొర్వెట్టి  లాంటి  లెజెండ్రీ  కార్లు కూడా ఉన్నాయి.  తాజాగా అమెరికన్ హెన్నెస్సీ వెనమ్ F5 రోడస్టర్‌ కారు కూడా చేరింది. ప్రపంచంలో  కేవలం 30 మంది ఓనర్లలో మైఖేల్ జోర్డాన్‌  ఒకరు. (మంటల్లో మహీంద్రా ఎక్స్‌యూవీ700: వీడియో వైరల్‌, స్పందించిన కంపెనీ )

హెన్నెస్సీ పెర్ఫార్మెన్స్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో జోర్డాన్‌తో పోటోను కంపెనీ సీఈవో జాన్ హెన్నెస్సీ ట్వీట్‌ చేశారు.  ప్రత్యేకమైన రోజు, స్పెషల్‌ ఫ్రెండ్‌ ​కోసం స్పెషల్‌  వెనమ్‌ ఎఫ్5ని అనే క్యాప్షన్‌తో ఈ ఫోటోను షేర్‌ చేయడం విశేషం.(యాపిల్‌ స్పెషల్‌ ఫీచర్‌తో స్మార్ట్‌ ట్రావెల్‌ మగ్‌, ధర వింటే..!)

A post shared by Hennessey Performance (@hennesseyperformance)

అద్భుతమైన ఈ కారు 6.6-లీటర్ ట్విన్-టర్బో V8 ఇంజిన్‌న్‌, 1,842 హార్స్‌పవర్‌, 1193 గరిష్ట టార్క్‌ను అందిస్తుంది.  కేవలం 2.6 సెకన్లలో 0 - 100 kmph వేగంతో  గరిష్ట వేగంతో గంటకు 498 కి.మీ.ని అధిగమిస్తుందని అంచనా. నివేదిక ప్రకారం కేవలం 30 కార్లు మాత్రమే తయారైనాయి. ధర 3 మిలియన్‌ డాలర్లు. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన , అత్యంత శక్తివంతమైన కన్వర్టిబుల్  కారని కంపెనీ ప్రకటించింది..

మరిన్ని వార్తలు :


Advertisement

ASBL
మరిన్ని వార్తలు