టాప్‌​ సెర్చ్‌డ్‌ సెలబ్రిటీ లిస్ట్‌ : అల్లు అర్జున్‌ ఏ ప్లేస్‌

2 Dec, 2020 13:30 IST|Sakshi
ఇమేజ్‌ సోర్స్‌ : యాహూ ఇండియా

టాప్‌ -10లో అల్లు అర్జున్‌

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ టాప్‌లో

రెండోస్థానంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ

సాక్షి,  న్యూఢిల్లీ: 2020 సంవత్సరానికి సంబంధించి తన ప్లాట్‌ఫాంలో ఎక్కువ మంది వెతికిన  సెలబ్రిటీల జాబితాను సెర్చ్ ఇంజన్ యాహూ ప్రకటించింది. దివంగత బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2020 లో  'మోస్ట్ సెర్చ్డ్ పర్సనాలిటీ'గా నిలవగా  అతని ప్రేయసి, నటి రియా చక్రవర్తి అత్యధికంగా శోధించిన  మహిళా సెలబ్రిటీగా ఉన్నారని యాహూఇండియా మంగళవారం విడుదలచేసిన జాబితాలో వెల్లడించింది.  కోవిడ్ వారియర్స్ ను  ‘పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్' 2020 గా పేర్కొంది. టాలీవుడ్‌ విషయానికి వస్తే..ఈ ఏడాది జనవరిలో అల వైకుంఠపురం సినిమాతో భారీ విజయాన్నిఅందుకున్న స్టైలిష్‌ స్టార్‌ అర్జున్‌ ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం.

  • 'మోస్ట్ సెర్చ్డ్ మేల్ సెలబ్రిటీ' విభాగంలో సుశాంత్ అగ్రస్థానంలో ఉండగా, అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్‌తో పాటు  కరోనా కారణంగా మరణించిన గాన గంధర్వుడు ఎస్సీ బాలసుబ్రమణ్యం, దివంగత బాలీవుడ్‌ సీనియర్‌ హీరో రిషి కపూర్‌, క్యాన్సర్‌తోచనిపోయిన ఇర్ఫాన్‌ ఖాన్‌ కూడా ఆ లిస్టులో ఉన్నారు.   
  • ఈ ఏడాది 'మోస్ట్ సెర్చ్డ్ ఫిమేల్ సెలబ్రిటీ' జాబితాలో రియా మొదటి స్థానంలో ఉంది. నటి కంగనా రనౌత్ రెండవ స్థానంలో, దీపికా పదుకొనే, సన్నీ లియోన్, ప్రియాంక చోప్రా ఉన్నారు.
  • 2020  'టాప్ న్యూస్‌మేకర్స్' కేటగిరీ విషయానికి వస్తే, ప్రధాని మోదీ మొదటి స్థానంలో నిలిచారు, సుశాంత్ , రియా సంయుక్తంగా రెండవ స్థానంలో, రాహుల్ గాంధీ మూడవ స్థానంలో ఉన్నారు.
  • 2020 విభాగంలో 'సెలబ్రిటీస్ విత్ బేబీస్ అండ్ ప్రెగ్నెన్సీ అనౌన్స్‌మెంట్స్' లో అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచారు. కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ రెండో స్థానంలో ఉండగా, శిల్పా శెట్టి రాజ్ కుంద్రా మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. కాగా కరోనా , లాక్‌డౌన్‌ కాలంలో వలస కార్మికులకు అండగా నిలిచిన నటుడు సోనూ సూద్‌ను 'హీరో ఆఫ్ ది ఇయర్' గా ప్రత్యేకంగా గుర్తించింది

టాప్‌ -10 మేల్‌ సెలబ్రిటీ  లిస్ట్‌
1. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్
2. అమితాబ్ బచ్చన్
3. అక్షయ్ కుమార్
4. సల్మాన్ ఖాన్
5. ఇర్ఫాన్ ఖాన్
6. రిషి కపూర్
7. ఎస్సీ బాలసుబ్రమణ్యం
8. సోను సూద్
9. అనురాగ్ కశ్యప్
10. అల్లు అర్జున్

ఎక్కువగా వెతికిన వారిలో రాజకీయ నేతలు ఎక్కువ స్థానాలనుఅక్రమించగా, ఈ జాబితాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండో స్థానంలో  నిలిచారు. 2017 తరువాత  మోదీ  అగ్రస్థానాన్ని కోల్పోవడం ఇదే మొదటి సారి.  రియా మూడోస్థానంలో ఉన్నారు. ఇక  ఆ తరువాతి స్ధానాల్లో  రాహుల్ గాంధీ, అమిత్ షా, ఉద్దవ్ ఠాక్రే, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, అమితాబ్ బచ్చన్, కంగనా రనౌత్ ఉన్నారు.

 ఈ ఏడాది ఎక్కువగా సెర్చ్‌ చేసిన  ప్రముఖుల జాబితా
1. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్
2. నరేంద్ర మోదీ
3. రియా చక్రవర్తి
4. రాహుల్ గాంధీ
5. అమిత్ షా
6. ఉద్ధవ్ థాక్రే
7. అరవింద్‌ కేజ్రీవాల్
8. మమతా బెనర్జీ
9. అమితాబ్ బచ్చన్
10. కంగనా రనౌత్


మరోవైపు మహిళల జాబితాలో బాలీవుడ్‌ భామలదే పై చేయి అయింది. టాలీవుడ్‌  హీరోయిన్లకు స్థానం దక్కలేదు. పురుషుల జాబితాలో సుశాంత్, మహిళల జాబితాలో రియాకు తొలి స్థానాలు దక్కాయి.
1. రియా చక్రవర్తి
2. కంగనా రనౌత్
3. దీపికా పదుకోణ్
4. సన్నీ లియోన్
5. ప్రియాంక చోప్రా
6. కత్రినా కైఫ్
7. నేహా కాకర్
8. కనికా కపూర్
9. కరీనా కపూర్
10. సారా అలీ ఖాన్

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా