Motorola E22s Android Phone Launched In India: Check Price Details And Specifications - Sakshi
Sakshi News home page

మోటరోలా బడ్జెట్‌ ఫోన్‌ వచ్చేసింది..ధర చూస్తే పండగే!

Published Mon, Oct 17 2022 1:10 PM

Motorola e22s Android phone launched in India - Sakshi

సాక్షి, ముంబై: మోటరోలా  కంపెనీ భారతీయ మార్కెట్‌లో  కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌  చేసింది. మోటో ఈ 22 ఎస్‌ పేరుతో దీన్ని సోమవారం తీసుకొచ్చింది. MediaTek చిప్‌సెట్‌తో రూ. 10,000 ధరలోపే దీన్ని తీసుకు రావడం విశేషం. (వాట్సాప్‌ లేటెస్ట్‌ అప్‌డేట్స్: 5 ఫీచర్లు కమింగ్‌ సూన్‌)

మోటో ఈ 22 ఎస్‌ ధరను రూ. 8,999గా నిర్ణయించింది. అక్టోబర్ 22 నుండి ఫ్లిప్‌కార్ట్‌తోపాటు, ప్రముఖ రిటైల్ స్టోర్లలో  కొనుగోలుకు లభ్యం.  64 జీబీ వేరియంట్‌లో ఆర్కిటిక్ బ్లూ , ఎకో బ్లాక్ అనే రెండు రంగుల్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోఉంటుంది. (ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ దివాలీ సేల్‌: కస్టమర్లకు మరో గుడ్‌ న్యూస్‌ )

మోటో ఈ 22 ఎస్‌ స్పెసిఫికేషన్స్‌ 
6.5అంగుళాల IPS LCD డిస్‌ప్లే
Android 12, 1600x720 రిజల్యూషన్‌
4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌
16+2  ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా 
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
5000mAh బ్యాటరీ

ఇదీ చదవండి:  రిలాక్స్ అండ్ రీ-ఎనర్జైజ్: ఉద్యోగులకు బ్రహ్మాండమైన దివాలీ ఆఫర్‌

Advertisement
Advertisement