భారత్‌లోకి టెస్లా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మస్క్‌ | Sakshi
Sakshi News home page

భారత్‌లోకి టెస్లా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మస్క్‌

Published Tue, Apr 9 2024 1:45 PM

Natural Progression To Provide Tesla Electric Vehicles In India Said Elon Musk - Sakshi

ప్రతి దేశంలోనూ ఎలక్ట్రిక్ కార్లు ఉండాలని, భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను అందించడం తమ కంపెనీకి సహజమైన పురోగతి అని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ అన్నారు. నార్జెస్ బ్యాంక్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నికోలై టాంగెన్‌తో జరిగిన చర్చలో భాగంగా ఈమేరకు ఎలోన్‌మస్క్‌ తన ఈ విషయాన్ని వెల్లడించారు.

‘భారత్‌లో పెరుగుతున్న జనాభా కంపెనీల అభివృద్ధికి తోడ్పడుతుంది. అన్ని దేశాల్లోలాగే భారత్‌లోనూ ఎలక్ట్రిక్‌ వాహనాలు ఉండాలనేది మా కంపెనీ లక్ష్యం. టెస్లా భారత్‌లోకి రావడం సహజమైన పురోగతే. ప్రపంచం అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో అన్ని వాహనాలను ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌గా మార్చడం చాలా సులువు’ అని ఎలోన్‌మస్క్‌ అన్నారు. అయితే ప్రభుత్వం ఇటీవల కొత్త ఈవీ పాలసీను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం వెలువడనంతవరకు టెస్లా భారత్‌లో ప్రవేశించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రతినిధులు, మంత్రులతో మస్క్‌ పలుమార్లు సంప్రదించిన విషయం తెలిసిందే. తాజాగా టెస్లా భారత్‌లోకి రావడం సహజపురోగతేనని మస్క్‌ చెప్పడం గమనార్హం. 

టెస్లా వంటి అంతర్జాతీయ విద్యుత్‌ వాహనాల దిగ్గజాల నుంచి పెట్టుబడులను ఆకర్షించే దిశగా కేంద్ర ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) పాలసీకి ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం దేశీయంగా తయారీ యూనిట్లపై కనీసం 500 మిలియన్‌ డాలర్లు (రూ. 4,150 కోట్లు) ఇన్వెస్ట్‌ చేసే సంస్థలకు సుంకాలపరమైన ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. అధికారిక ప్రకటన ప్రకారం ఈవీ ప్యాసింజర్‌ కార్లను ఏర్పాటు చేసే కంపెనీలు 35,000 డాలర్లకు పైబడి విలువ చేసే వాహనాలపై 15 శాతం సుంకాలతో పరిమిత సంఖ్యలో కార్లను దిగుమతి చేసుకునేందుకు వీలుంటుంది. 

ఇదీ చదవండి: విమానంలో 135 మంది.. గాల్లోనే ఊడిన ఇంజిన్‌ కవర్‌

విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఈవీ వాహనాల కనిష్ట సీఐఎఫ్‌(కాస్ట్‌, ఇన్సూరెన్స్‌, ఫ్రైట్‌) విలువ రూ.29లక్షలు ఉంటే ఐదేళ్ల పాటు  15% కస్టమ్స్ డ్యూటీ విధించనున్నారు. అలా అయితే తయారీదారు మూడేళ్లలో భారత్‌లో తయారీ సౌకర్యాలను నెలకొల్పాల్సి ఉంటుంది. కంపెనీలకు గరిష్టంగా రూ.6,484 కోట్ల వరకే మినహాయింపులు ఇవ్వనున్నారు. కంపెనీ కుదుర్చుకున్న ఒప్పందం కంటే అదనంగా పెట్టుబడుల మొత్తం రూ.6,600 కోట్లు ఉంటే గరిష్టంగా 40,000 ఈవీలు, ఏటా 8,000 మించకుండా దేశంలోని అనుమతిస్తారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement