సాక్షి మనీ మంత్ర: లాభాల్లో కదలాడుతున్న దేశీయ మార్కెట్‌ సూచీలు | Sakshi
Sakshi News home page

సాక్షి మనీ మంత్ర: లాభాల్లో కదలాడుతున్న దేశీయ మార్కెట్‌ సూచీలు

Published Wed, Oct 11 2023 9:49 AM

Nifty Indian Market - Sakshi

అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 334 పాయింట్ల లాభంతో 66413 దగ్గర ట్రేడవుతోంది.

నిఫ్టీ 97 పాయింట్లు లాభపడి 19,787 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.22 దగ్గర ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఐసీఐసీఐ బ్యాంక్‌, విప్రో, యాక్సిస్‌ బ్యాంక్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ, ఇన్ఫోసిస్‌ అత్యధికంగా లాభపడుతున్న షేర్ల జాబితాలో ఉన్నాయి. 

అమెరికా మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమై.. చివరకు అవే లాభాలతో ముగిశాయి. ఐరోపా సూచీలు మాత్రం స్పష్టమైన లాభాలతో స్థిరపడ్డాయి. నేడు ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు సానుకూలంగా కదలాడుతున్నాయి. ఇజ్రాయెల్‌ యుద్ధ భయాల నుంచి మార్కెట్లు క్రమంగా కోలుకుంటాన్నాయినే సంకేతాలు ఉన్నాయి. అయితే, చమురు ధరల పెరుగుదల మాత్రం కలవరపెడుతోంది. మంగళవారం బ్రెంట్‌ బ్యారెల్‌ చమురు ధర 87.91 డాలర్లకు చేరింది. 
 

Advertisement
Advertisement