కేంద్రం కీలక ఆదేశాలు : కార్లలో 6 ఎయిర్ బ్యాగ్లు..తగ్గే ప్రసక్తే లేదు
Published
Thu, Sep 29 2022 2:42 PM
కార్ల విషయంలో కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఏడాది అక్టోబర్ 1 నుంచి కార్లలో ఆరు ఎయిర్ బ్యాగ్స్ తప్పని సరిగా ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది.
Considering the global supply chain constraints being faced by the auto industry and its impact on the macroeconomic scenario, it has been decided to implement the proposal mandating a minimum of 6 Airbags in Passenger Cars (M-1 Category) w.e.f 01st October 2023.
ఈ సందర్భంగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఎయిర్ బ్యాగుల అంశంపై స్పందించారు. ఆటో పరిశ్రమ ఎదుర్కొంటున్న గ్లోబల్ సప్లయి చైన్ అవరోధాలు, మైక్రో ఎకనామిక్స్ (స్థూల ఆర్థిక) పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకొని ప్యాసింజర్ కార్లలో (ఎం-1 వేరియంట్) కార్ల ధర, వేరియంట్లతో సంబంధం లేకుండా వచ్చే ఏడాది అక్టోబర్1, 2023 వరకు ఆరు ఎయిర్ బ్యాగులు ఉండాల్సిందేనని నితిన్ గడ్కరీ ట్వీట్లో పేర్కొన్నారు.
కార్ల ధరలు పెరుగుతాయ్
కేంద్రం ఈ ఏడాది అన్ని కార్లలో ఆరు ఎయిర్ బ్యాగులు ఉండాలనే నిబంధనల్ని అమలు చేసేందుకు ప్రయత్నించింది. అయితే కేంద్రం నిర్ణయాన్ని కార్ల తయారీ సంస్థలు వ్యతిరేకించాయి. ఎయిర్ బ్యాగుల్ని పెంచితే.. కార్ల ధరలు పెరుగుతాయని తద్వారా ఆ భారం తయారీ సంస్థలపై, కార్ల కొనుగోలు దారులపై పడుతుందని స్పష్టం చేశాయి.
నిబంధనల సవరింపు
ఈ నేపథ్యంలో కేంద్రం అన్ని కార్లలో ఆరు ఎయిర్ బ్యాగులు ఉండాలన్న నిబంధనల్ని సవరించింది. కేవలం 8 సీట్లున్న (ఎం -1 వేరియంట్ కార్లు) కార్లలో మాత్రమే ఎయిర్ బ్యాగులు ఉండాలని తెలిపింది.