ఉద్యోగుల తొలగింపు.. ప్రముఖ టెలికం కంపెనీ కీలక నిర్ణయం

21 Feb, 2024 14:53 IST|Sakshi

ఉద్యోగులకు ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ నోకియా భారీ షాకిచ్చింది. పున‌ర్వ్య‌వ‌స్ధీక‌ర‌ణ ప్ర‌ణాళిక‌ల్లో భాగంగా భార‌త్‌లో పనిచేస్తున్న  250 మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలుస్తోంది.  

దేశీయంగా పలు టెలికాం సంస్థలు 5జీ కార్యాకలాపాల్ని ముమ్మరం చేస్తున్నాయి. అయితే వాటికి ఉన్నంత డిమాండ్ నోకియా 5జీ పట్ల లేదు. దీంతో 5జీ మార్కెట్ లో నోకియా సత్తా చాటుతుందా? లేదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న తరుణంలో నోకియా ఉద్యోగులకు ఉద్వాసన నిర్ణయం తీసుకుంది.

ఫలితంగా మ‌నీ, టెక్నాల‌జీ, లీగ‌ల్ స్ట‌ఫ్ ఇన్‌ఛార్జ్‌ల వంటి ప‌లు కీల‌క విభాగాల్లో ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపేందుకు ప్రయత్నిస్తుంది. అదే సమయంలో మొబైల్ నెట్‌వ‌ర్క్స్‌, క్లౌడ్‌, నెట్‌వ‌ర్క్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ వంటి మూడు విభాగాలుగా విభ‌జించ‌నుంది. ప్ర‌తి విభాగం భార‌త్‌లో నోకియా వ్యాపారాల్లో వివిధ విభాగాల‌పై దృష్టి సారించనుంది. 

whatsapp channel

మరిన్ని వార్తలు