ఈపీఎస్ పెన్షనర్లకు శుభవార్త.. ఇక ముందుగానే ఖాతాలోకి పెన్షన్!

18 Jan, 2022 18:11 IST|Sakshi

ఈపీఎస్-95 పెన్షనర్లకు ఈపీఎఫ్ఓ శుభవార్త తెలిపింది. ఇక నుంచి ఈపీఎఫ్ పెన్షనర్లు ప్రతి నెలా చివరి రోజున పెన్షన్ పొందనున్నట్లు సంస్థ పేర్కొంది. పెన్షన్ కోసం పింఛనుదారులు ప్రతినెలా 1 లేదా 5వ తేదీ వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఈ నెల చివరిన రెండు రోజుల ముందుగానే పెన్షనర్ల బ్యాంకు ఖాతాలో డబ్బులో పడేలా పీఎఫ్ కమిసనర్ విశాల్ అగర్వాల్ ఆదేశాలు జారీ చేశారు. పెన్షన్ పంపిణీ చేసే బ్యాంకులకు విధి విధానాలను జారీ చేయాలని రీజనల్ పీఎఫ్ ఆఫీసులకు సూచించారు.

పెన్షన్ చెల్లించే బ్యాంకులతో చేసుకున్న ఒప్పందంలో ఇలా.. "పెన్షన్ డబ్బులు ప్రతినెలా 1 లేదా 5వ తేదీన కాకుండా నెలా చివరి రోజున(ఆ నెలకు ముందు) పెన్షన్ క్రెడిట్ చేయనున్నట్లు" ఉంది. చాలామంది పింఛనుదారులకు పెన్షన్ డబ్బులు గడువు తేదీన ఖాతాలో క్రెడిట్ కాకపోవడంతో ఈపీఎస్ పెన్షనర్లు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని పెన్షన్ డివిజన్ సమీక్షించింది. ఆర్బిఐ ఆదేశాలకు అనుగుణంగా అన్ని రీజనల్ ఆఫీసులు నెల చివరి పనిదినం నాడు లేదా అంతకు ముందు పెన్షనర్ ఖాతాలో నగదు క్రెడిట్ చేసే విధంగా బ్యాంకులకు సూచించాలని తెలిపింది.  

ఈపీఎఫ్ఓ తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న 80 లక్షల మంది పెన్షన్ దారులకు మేలు జరగనుంది. తాజా నిబంధనలతో వారికి ముందుగానే పెన్షన్ అకౌంట్‌లో జమ అవుతుంది. ఉద్యోగుల పెన్షన్ స్కీం 1995 (ఈపీఎస్-95) పెన్షనర్లు అందరూ కూడా పెన్షన్ పొందడం కోసం ప్రతి సంవత్సరం జీవన్ ప్రమాన్ పత్రం(జెపిపి) లేదా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక పెన్షన్ విషయంలో పెన్షన్‌దారులకు మేలు చేసేలా ఈపీఎఫ్ఓ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది. కనీస పెన్షన్ పెంచే దిశగా ఆలోచిస్తోంది.

(చదవండి: ప్లీజ్‌.. సాయం చేయండి: చైనా పంచన చేరిన తాలిబన్లు)

మరిన్ని వార్తలు