Sakshi News home page

ఆఫ్‌లైన్‌లోనూ ‘ఈ-రుపీ’ లావాదేవీలు

Published Fri, Feb 9 2024 2:59 PM

Offline Erupee Transactions Will Be Introduced By RBI - Sakshi

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) ఆఫ్‌లైన్‌లోనూ ఈ-రుపీ లావాదేవీలను అందుబాటులోకి తేనున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. ఇది అందుబాటులోకి వస్తే డిజిటల్‌ రుపీ వినియోగదారులు ఇంటర్నెట్‌ సదుపాయం లేనిచోట కూడా తమ లావాదేవీలు కొనసాగించే అవకాశం ఉంటుంది. ప్రస్తుత సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ) పైలట్‌ ప్రాజెక్ట్‌లోనే ఆఫ్‌లైన్‌ ఈ-రుపీ లావాదేవీలను పరిచయం చేయనున్నట్టు ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తెలిపారు.

2022 డిసెంబర్‌లో పైలట్‌ ప్రాజెక్టుగా రిటైల్‌ సీబీడీసీని ఆర్బీఐ ప్రారంభించిన విషయం తెలిసిందే. 2023 డిసెంబర్‌లో ఇది 10 లక్షల లావాదేవీలకు చేరింది. ఎంపిక చేసిన బ్యాంకులు తమ కస్టమర్లకు డిజిటల్‌ రుపీ వ్యాలెట్ల సౌకర్యాన్ని అందిస్తున్నాయి. వీటి ద్వారానే వ్యక్తుల మధ్య, వ్యక్తులు-వ్యాపారస్థుల మధ్య లావాదేవీలు జరుగుతున్నాయి. ఇప్పటికే యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) చెల్లింపులను ఆఫ్‌లైన్‌లోనూ జరిపేలా ఆర్బీఐ అనుమతించింది.

Advertisement
Advertisement