Sakshi News home page

ఇలాంటి మోసాలు జరుగుతున్నాయ్! ఆదమరిస్తే అకౌంట్‌లో డబ్బు మాయం!

Published Wed, Aug 16 2023 3:52 PM

Online Fraud Business Man Lost Money for Downloading a Screen Sharing App - Sakshi

ఆధునిక కాలంలో టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ.. ఆన్‌లైన్ మోసాలు మరింత వేగంగా పెరుగుతున్నాయి. ఇటీవల ఫోన్‌పే (PhonePe) అప్డేట్ చేసుకోవడం వల్ల రూ. 50,000 కంటే ఎక్కువ నష్టపోయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నివేదికల ప్రకారం.. కర్ణాటక ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఫోన్‌పే వినియోగించడంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఆ యాప్ అప్పటికే యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డులతో లింక్ అయి ఉంది. దీంతో అతడు పరిష్కార మార్గం కోసం గూగుల్‌లో వెతికే ప్రయత్నంలో 08918924399 నెంబర్ చూసి దానికి కాల్ చేసాడు. అవతలి వైపు ఉన్న వ్యక్తి ఫోన్ తీయగానే మొదట కాల్ కట్ చేసి, మరొక నంబర్ (01725644238) నుండి కాల్ చేసాడు.

బాధితుడు ఫోన్‌పే యాప్‌ వినియోగించడంలో వచ్చిన సమస్యను గురించి అపరిచిత వ్యక్తికి చెప్పాడు. ఆ సమయంలో అతని రెండు బ్యాంక్ అకౌంట్స్ గురించి కూడా తెలుసుకున్నాడు. ఆ తరువాత స్క్రీన్ షేరింగ్ యాప్ అయిన రస్ట్ డెస్క్‌ని ఇన్‌స్టాల్ చేయమని బాధితుడిని కోరాడు.

అపరిచిత వ్యక్తి సలహా మేరకు స్క్రీన్ షేరింగ్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నాడు. అప్పటికే బ్యాంక్ అకౌంట్స్ మీద నిఘా వేసిన స్కామర్ బాధితుని బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్‌ నుంచి రూ.29,998 & యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ నుంచి రూ.27,803 దోచేశాడు. మోసపోయామని తెలుసుకున్న బాధితుడు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కు ఫిర్యాదు చేయగా, బెల్తంగడి పోలీసులు జూలై 31న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

ఇదీ చదవండి: అకౌంట్‌లో డబ్బు లేకున్నా రూ. 80000 విత్‌డ్రా చేసుకోవచ్చు

ఇలాంటి మోసాలకు చెక్ పెట్టడం ఎలా..

  • ప్రస్తుతం ఇలాంటి మోసాలు ఎక్కువవుతున్నాయని అందరికి తెలుసు. కాబట్టి వీటి నుంచి బయటపడాలంటే ఉత్తమ మార్గం అపరిచితులను నమ్మకుండా ఉండటమే..
  • ఒకవేళా ఏదైనా సమస్య తలెత్తితే అధికారికి నెంబర్స్ లేదా ఈమెయిల్స్ ద్వారా పరిష్కరించుకోవాలి.
  • సమస్యకు పరిష్కారం వెతికే క్రమంలో ప్రాసెస్ గురించి ఖచ్చితంగా తెలియకపోతే.. నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
  • ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన మరో అంశం ఏమిటంటే ఏ కంపెనీ అయినా ఇతర యాప్స్ డౌన్లోడ్ చేయమని గానీ.. ఫోన్ స్క్రీన్ షేర్ చేయమని గానీ అడగదు.
  • ఇటీవల వాట్సాప్ & టెలిగ్రామ్ ద్వారా జరుగుతున్న మోసాలు చాలా ఎక్కువవుతున్నాయి. కావున మీకు తెలియని నెంబర్ నుంచి మెసేజ్ వస్తే బ్లాక్ చేయడం ఉత్తమం.

Advertisement
Advertisement