Persistent Systems: ఫ్రెషర్లకు భారీగా కొలువులు | Sakshi
Sakshi News home page

Persistent Systems: ఫ్రెషర్లకు భారీగా కొలువులు

Published Sat, Jul 24 2021 12:33 AM

Persistent Systems to Hire 2,000 People This Fiscal - Sakshi

ముంబై: ఐటీ రంగ సంస్థ పెర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనుంది. వ్యాపార అవసరాన్నిబట్టి అనుభవజ్ఞులను సైతం కొత్తగా చేర్చుకోనుంది. గత 9 నెలల్లో 4,200 మందిని కంపెనీ  చేర్చుకుంది. వీరిలో 700 మంది ఫ్రెషర్లు. జూన్‌ నాటికి సంస్థలో మొత్తం 14,904 మంది ఉద్యోగులు ఉన్నారని పెర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌ చీఫ్‌ ఫైనా న్షియల్‌ ఆఫీసర్‌ సునిల్‌ సప్రే వెల్లడించారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement