ధరలు పెరిగినా.. తగ్గేదేలే అంటున్నారు.. | Sakshi
Sakshi News home page

ధరలు పెరిగినా.. తగ్గేదేలే అంటున్నారు..

Published Thu, Jun 16 2022 8:42 AM

Petrol and Deicel Consuption In June Increased - Sakshi

న్యూఢిల్లీ: కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవైపు పర్యావరణ అనుకూల ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహిస్తున్నప్పటికీ.. మరోవైపు కర్బన ఇంధనాలైన పెట్రోల్, డీజిల్‌ విక్రయాలు భారీగా పెరుగుతున్నాయి. జూన్‌ నెలలో మొదటి రెండు వారాల్లో పెట్రోల్‌ విక్రయాలు 54 శాతం పెరగ్గా, డీజిల్‌ విక్రయాలు 48 శాతం అధికంగా నమోదయ్యాయి. ప్రభుత్వరంగ ఆయిల్‌ కంపెనీలు జూన్‌ 1 నుంచి 14 వరకు 1.28 మిలియన్‌ టన్నుల పెట్రోల్‌ విక్రయించాయి. 2021లో ఇదే కాలంలో నమోదైన విక్రయాలతో పోలిస్తే 54 శాతం ఎక్కువ. కానీ, కరోనాకు ముందు 2019లో జూన్‌ 1–14 నాటి విక్రయాలు 1.02 మిలియన్‌ టన్నులతో పోల్చి చూసినా 25 శాతం అధికంగా నమోదైనట్టు తెలుస్తోంది. ఎక్కువగా వినియోగమయ్యే డీజిల్‌ విక్రయాలు జూన్‌ 1–14 మధ్య 3.4 మిలియన్‌ టన్నులుగా నమోదయ్యాయి. 2021 ఇదే కాలంలోని విక్రయాలతో పోలిస్తే 47.8 శాతం ఎక్కువ. ఇక 2020లో ఇదే కాలంతో పోలిస్తే 37.3 శాతం, 2019లో ఇదే కాలంతో పోలిస్తే 20.3 శాతం అధికం. పెట్రోల్, డీజిల్‌కు అధిక డిమాండ్‌ మళ్లీ ఏర్పడినట్టు, సాగు సీజన్‌ కూడా ఇందుకు కారణమని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.  

గ్యాస్‌ విక్రయాలు.. 
వంటగ్యాస్‌ విక్రయాలు 4.21 శాతం పెరిగి 1.06 మిలియన్‌ టన్నులుగా నమోదయ్యాయి. 2019లో ఇదే కాలంతో పోలిస్తే 28 శాతం అధికం. విమాన ఇంధనం (ఏటీఎఫ్‌) విక్రయాలు గతేడాది ఇదే కాలంలో పోలిస్తే రెట్టింపై 2,42,900 టన్నులుగా ఉన్నాయి.

చదవండి: సంపద సృష్టిలో అదానీ అదరహో

Advertisement
Advertisement