Piramal Enterprises sells stake in Shriram Finance for Rs 4823 cr - Sakshi
Sakshi News home page

శ్రీరామ్‌ ఫైనాన్స్‌ నుంచి పిరమల్‌ ఔట్‌

Published Thu, Jun 22 2023 7:36 AM

Piramal sells stake in Shriram Finance - Sakshi

ముంబై: యూఎస్‌ పీఈ దిగ్గజం టీపీజీ తదుపరి తాజాగా శ్రీరామ్‌ ఫైనాన్స్‌లో పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ వాటా విక్రయాన్ని చేపట్టింది. ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా శ్రీరామ్‌ ఫైనాన్స్‌లో గల మొత్తం 8.34 శాతం వాటాను పిరమల్‌ విక్రయించింది. ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఎంఎఫ్, కొటక్‌ మహీంద్రా ఎంఎఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఇన్సూరెన్స్, బ్లాక్‌రాక్, బీఎన్‌పీ పరిబాస్, సొసైటీ జనరాలి తదితర సంస్థలకు 3.12 కోట్లకుపైగా షేర్లను విక్రయించింది. బ్లాక్‌డీల్స్‌ ద్వారా రూ. 1,545 ధరలో రూ. 4,824 కోట్లకు వాటాను ఆఫర్‌ చేసింది.

సోమవారం శ్రీరామ్‌ ఫైనాన్స్‌లో 2.65% వాటాను ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా రూ. 1,390 కోట్లకు టీపీజీ విక్రయించిన సంగతి తెలిసిందే. ఎంఎఫ్‌లు, సంస్థాగత ఇన్వెస్టర్లు వీటిని కొనుగోలు చేశాయి. కాగా.. బ్లాక్‌డీల్‌ వా ర్తల ప్రభావంతో బుధవారం ఎన్‌ఎస్‌ఈలో శ్రీరామ్‌ ఫైనా న్స్‌ షేరు 11.3% దూసుకెళ్లి రూ. 1,736 వద్ద నిలిచింది. ఇక మంగళవారం 6% జంప్‌చేసి రూ. 838కు చేరి న పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ బుధవారం మరింత అధికంగా 14.2% దూసుకెళ్లి రూ.958 వద్ద ముగిసింది.

పునర్వ్యవస్థీకరణతో 
శ్రీరామ్‌ గ్రూప్‌ చేపట్టిన పునర్వ్యవస్థీకరణ తదుపరి పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు గ్రూప్‌లోని పలు కంపెనీలలో షేర్లు లభించాయి. ఈ బాటలో శ్రీరామ్‌ ఫైనాన్స్‌లో 8.34 శాతం వాటాను పొందగా.. శ్రీరామ్‌ జీఐ హోల్డింగ్స్, ఎల్‌ఐ హోల్డింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్‌ హోల్డింగ్స్‌లోనూ 20 శాతం చొప్పున వాటాలు లభించాయి. దీంతో శ్రీరామ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో 13.33 శాతం, శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో 14.91 శాతం వాటాను సొంతం చేసుకుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement