ఆరు లేయర్లతో ప్లాస్టో వాటర్‌ ట్యాంకులు

15 Apr, 2023 04:41 IST|Sakshi

హైదరాబాద్‌: నీటి ట్యాంకుల తయారీ సంస్థ ప్లాస్టో ఆరు లేయర్లతో కూడిన ట్యాంక్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. నాణ్యమైన ప్లాస్టిక్‌ మెటీరియల్‌తో తయారుచేసిన ఈ ట్యాంకు సూర్యరశ్మిని లోపలికి ప్రవేశించనీయకుండా చేసి అధిక ఉష్ణోగ్రతల్లోనూ నీటిని చల్లగా ఉంచుతుంది.

ప్రమాదకర యూవీ కిరణాల నుంచి రక్షణనిస్తుంది. సులభంగా శుభ్రం చేసుకునేలా వీటిని రూపొందించారు. ‘‘ప్రతి ఒక్కరికి ఏడాది పాటు సురక్షితమైన, ఆరోగ్యకరమైన తాగునీటికి అందించాలనే లక్ష్యంతో వీటిని తయారు చేసాము. ప్లాస్టో డీలర్‌ స్టోర్లలో ఇవి లభ్యమవుతాయి’’ అని కంపెనీ ప్రకటన  ద్వారా తెలిపింది. 

మరిన్ని వార్తలు