ఎలక్ట్రిక్ కార్లపై సబ్సీడీ, ఒక్క నెలలోనే హాట్‌ కేకుల్లా అమ్ముడైన కార్లు!

5 Jan, 2022 16:13 IST|Sakshi

మారుతున్న కాలానికి అనుగుణంగా మన అభిరుచులు మారాలి. లేదంటే ఈ పోటీ ప్రపంచంలో వెనకబడి పోతాం. అందుకే వాహనదారులు ప్రస్తుతం వినియోగిస్తున్నఇంధన వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల్ని నడిపేందుకు మొగ్గుచూపుతున్నారు.దీనికి తోడు ఆయా ప్రభుత్వాలు సబ్సీడీని అందిస్తుండడంతో ఎన్నడూ లేని విధంగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు భారీస్థాయిలో జరుగుతున్నాయి.

చైనా పాసింజర్‌ కార్‌ అసోషియేషన్‌ (సీపీసీఏ) ప్రకారం..
చైనాకు చెందిన ప్లగ్‌-ఇన్‌ కార్ల అమ్మకాలు ఈ ఏడాదిలో 5.5 మిలియన్లు దాటుతాయని సీపీసీఏ ప్రతినిధులు చెబుతున్నాయి. ఇదే సంస్థకు చెందిన కమర్షియల్‌ వెహికల్స్, బస్సుల అమ్ముకాలు ఇదే స్థాయిలో జరిగితే 6 మిలియన్లు దాటడం ఖాయమని అంటున్నారు. గతేడాది 11నెలల కాలంలో 14.3 శాతంతో  ప్లగ్‌-ఇన్‌ ఎలక్ట్రిక్ కార్లు 2.7 మిలియన్ల అమ్ముడవ‍్వగా.. ఒక్క డిసెంబర్‌ నెలలో 3 మిలియన్‌లకు పైగా అమ్ముడవ్వడం ఎలక్ట్రిక్ కార్ల వినియోగం ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ ఏడాదిలో ప్లగ్‌-ఇన్‌ కారు అమ్మకాలు 6 మిలియన్లు దాటుతాయని ఆ సంస్థ ప్రతినిధులు అభిపప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  
 
30 శాతం రాయితీలు 
వెలుగులోకి వచ్చిన కొన్ని నివేదికల ప్రకారం..2021 నుంచి ఎలక్ట్రిక్ కారు కొనుగోలుపై చైనాకు చెందిన ఆటోమొబైల్‌ కంపెనీలు 30 శాతం రాయితీలు ఇస్తున్నాయి. అందుకు ఉదాహరణే టెస్లా కార్లేనని రిపోర్ట్‌లు పేర్కొన్నాయి. నాటి మార్కెట్‌ ధరలకు అనుగుణంగా టెస్లా కారు ధర రూ.1,85,334.61 ఉండగా 30శాతం రాయితీతో రూ.1,29,464.71 కే అందించినట్లు రిపోర్ట్‌లు ప్రధానంగా హైలెట్‌ చేస్తున్నాయి.రాయితీలు ఇస్తున్న సమయంలో మార్కెట్ గణనీయంగా దాదాపు రెండింతలు విస్తరిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ సబ్సిడీ  2023 వరకు కొనసాగుతాయని, ఆ తర్వాత రాయితీల్ని తీసివేస్తారని చైనా కార్ల అసోసియేషన్‌ తెలిపింది.

చదవండి: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రియల్ రేంజ్ ఇంతేనా..?

మరిన్ని వార్తలు