యాక్సిస్‌ బ్యాంకు కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌  | Private Lender Axis Bank Revises FD Rates; Check Here For More Details - Sakshi
Sakshi News home page

యాక్సిస్‌ బ్యాంకు కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌ 

Published Tue, Sep 19 2023 3:50 PM

Private Lender Axis Bank Revises FD Rates check here details - Sakshi

Axis Bank Fd Rates: ప్రైవేటు రంగ బ్యాంకు యాక్సిస్‌బ్యాంకు తన ఖాతాదారులకు శుభవార్త అందించింది. రూ. 2 కోట్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (FDs) వడ్డీ రేట్లను యాక్సిస్ బ్యాంక్ సవరించింది. బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం సవరించిన వడ్డీ రేట్లు సోమవారం (సెప్టెంబర్ 18, 2023) నుంచి అమల్లోకి వచ్చాయి. 

బ్యాంక్ ఇప్పుడు 15 నెలల నుండి 5 సంవత్సరాల లోపు మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై గరిష్టంగా 7.10శాతం వడ్డిని చెల్లిస్తుంది.  5 నుండి 10 ఏళ్లలో మెచ్యూరయ్యే ఎఫ్‌డిలపై 7శాతం వడ్డి లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 5-10 సంవత్సరాల ఎఫ్‌డీలపై 7.75శాతం గరిష్ట స్టాండర్డ్ రేటు వర్తిస్తుంది. (చంద్రయాన్‌-3 సక్సెస్‌: వాళ్ల ఏడుపు చూడలేకే, టీ బండి నడుపుకుంటున్నా!)

7- 10 ఏళ్ల లోపు  మెచ్యూరిటీ ఉన్న  FDలపై సాధారణ ప్రజలకు 3-7శాతం,  సీనియర్ సిటిజన్‌లకు 3నుంచి 5 ఏళ్ల డిపాజిట్లపై గరిష్టంగా 7.75 శాతం వరకు వడ్డీ రేట్‌ యాక్సిస్ బ్యాంక్ చెల్లిస్తుంది.13 - 30 నెలల వరకు మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై,  నాన్-సీనియర్ సిటిజన్‌లకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 7.85 శాతం వడ్డీ వర్తిస్తుంది. అలాగే 15 నెలల నుండి 5 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డిలపై 7.10శాతంగా ఉంటుంది. కాగా కేంద్ర  బ్యాంకు ఆర్‌బీఐ వడ్డీరేట్ల ఆధారంగా ఆయా ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకులు లోన్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వర్తించే వడ్డీ రేట్లను సవరిస్తూ ఉంటాయి. ఈ  నేపథ్యంలోనే తాజాగా  యాక్సిస్‌ బ్యాంక్‌ ఫిక్స్డ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను  పెంచుతూ నిర్ణయం తీసుకుంది.  
 

Advertisement
Advertisement