Sakshi News home page

సదా అప్రమత్తంగా ఉండండి

Published Fri, Feb 16 2024 12:14 AM

RBI Governor Shaktikanta Das asks banks to remain vigilant against build-up of risks - Sakshi

ముంబై: బ్యాంకింగ్‌ రంగంలో ఎల్లప్పుడూ అన్ని అంశాలపై అప్రమత్తతతో ఉండాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంతదాస్‌ సూచించారు. ఉదాసీనతకు  చోటులేకుండా సవాళ్ల పట్ల జాగరూకత వహించాలన్నారు. పటిష్ట బ్యాంకింగ్‌కు సంబంధించి నిరంతర పరస్పర చర్యల్లో భాగంగా గవర్నర్‌ కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఎండీ, సీఈఓలతో సమావేశమయ్యారు.

ఫైనాన్షియల్‌ విధుల నిర్వహణలో భారత్‌ బ్యాంకింగ్‌ చక్కటి పురోగతి సాధించిందని ఈ సందర్భంగా అన్నారు. అయితే చక్కటి బ్యాలెన్స్‌ సీట్స్‌ నిర్వహణ, వ్యక్తిగత రుణాలపై పర్యవేక్షణ, సహ–రుణ మార్గదర్శకాలను పాటించడం, ఎన్‌బీఎఫ్‌సీ రంగానికి నిధుల అందజేత, ద్రవ్య లభ్యత సవాళ్లు, ఐటీ– సైబర్‌ సెక్యూరిటీ, పాలనా వ్యవహారాల పటిష్ట నిర్వహణ, డిజిటల్‌ మోసాల నివారణ వంటి అంశాలపై అన్ని సమయాల్లో అప్రమత్తత పాటించాలని పేర్కొన్నారు.

  ముఖ్యంగా ఖాతాదారుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రాముఖ్యత ఇవ్వాలని పేర్కొంటూ... ఫైనాన్షియల్‌ వ్యవస్థ రక్షణ, స్థిరత్వలో ఇది కీలకమని అన్నారు. ఆర్‌బీఐ ఫిన్‌టెక్‌ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడానికి, డిజిటల్‌ బ్యాంకింగ్‌ యూనిట్‌లకు మరింత ప్రోత్సాహాన్ని అందించడానికి బ్యాంకులకు తగిన ప్రోత్సాహం ఉంటుందన్నారు. ఈ సమావేశాలకు డిప్యూటీ గవర్నర్‌లు ఎం రాజేశ్వర్‌రావు, స్వామినాథన్‌సహా నియంత్రణ, పర్యవేక్షణ కార్యక్రమాల ఇన్‌ఛార్జ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు కూడా హాజరయ్యారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement