Reserve Bank Of India Likely To Raise Repo Rate By Another 25bps To Tame Inflation - Sakshi
Sakshi News home page

పెరగనున్న వడ్డీ రేట్లు.. మరో పావు శాతం రెపో పెంపు ఖాయం!

Published Mon, Mar 27 2023 7:44 AM

RBI likely to raise repo rate by another 25 bps - Sakshi

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) వచ్చే నెల 3,5,6వ తేదీల్లో జరపనున్న ఆర్థిక సంవత్సరం తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపో రేటును మరో పావుశాతం పెంచడం ఖాయమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదే జరిగితే బ్యాంకులకు ఆర్‌బీఐ తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు 6.75 శాతానికి పెరగనుంది. పాలసీ సమీక్ష నిర్ణయాలు 6వ తేదీన వెలువడనున్నాయి.

ఇదీ చదవండి: Twitter gold tick: నీ బ్యాడ్జ్‌ బంగారం గానూ! ట్విటర్‌ గోల్డ్‌ టిక్‌ కావాలంటే అంతా?

ఉక్రెయిన్‌పై రష్యా దాడి, అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో దీర్ఘకాలంగా 4 శాతంగా ఉన్న రెపో రేటు, మే 4వ తేదీన మొదటిసారి 0.40 శాతం పెరిగింది. జూన్‌ 8, ఆగస్టు 5, సెప్టెంబర్‌ 30 తేదీల్లో అరశాతం చొప్పున పెరుగుతూ, 5.9 శాతానికి చేరింది. డిసెంబర్‌ 7న ఈ రేటు పెంపు 0.35 శాతం ఎగసి 6.25 శాతాన్ని తాకింది. ఫిబ్రవరి మొదట్లో జరిగిన ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానంలో వరుసగా ఆరవసారి (పావు శాతం) రేటు పెంపుతో మే నుంచి 2.5 శాతం రెపో రేటు పెరిగింది. ఈ రేటు 6.5 శాతానికి ఎగసింది.

ఇదీ చదవండి: ఇంట్లో ఎక్కువ డబ్బు పెట్టుకుంటున్నారా.. ఏమవుతుందో తెలుసా?

జాగరూకత అవసరం: 
కాగా, వడ్డీరేట్ల పెరుగుదల, దీనికి సంబంధించిన ఎదురయ్యే సవాళ్ల వంటి విషయాల్లో అప్రమత్తత అవసరమని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ బ్యాంకింగ్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లతో ఆమె ఒక అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. బ్యాంకింగ్‌ పనితీరు, పటిష్టతపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించడం జరిగింది.

ఇదీ చదవండి: గ్యాస్‌ వినియోగదారులకు ఊరట.. ధరల పరిమితిపై కేంద్రం పరిశీలన!

Advertisement

తప్పక చదవండి

Advertisement