రిలయన్స్ రిటైల్, అమెజాన్ డీల్? | Sakshi
Sakshi News home page

రిలయన్స్ రిటైల్, అమెజాన్ డీల్?

Published Thu, Sep 10 2020 3:09 PM

Reliance offers usd 20 billion-stake to Amazon in retail arm - Sakshi

సాక్షి, ముంబై: పెట్టుబడుల సమీకరణలో  రిలయన్స్ రీటైల్ హవా కొనసాగుతోంది. పారిశ్రామిక దిగ్గజం ముకేశ్  అంబానీ నేతృత్వంలోని  రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) తన రిటైల్  విభాగం రిలయన్స్ రిటైల్ లో సుమారు 20 బిలియన్ల డాలర్ల విలువైన వాటాను అమెజాన్ కు విక్రయించాలని ప్లాన్ చేసింది. ఈ మేరకు అమెజాన్, రిలయన్స్ మధ్య చర్చలు జరిగినట్టు  సమాచారం. ఈ లావాదేవీపై అమెజాన్ ఆసక్తి చూపుతున్నట్టు తాజా నివేదికల సమాచారం.  సిల్వర్ లేక్ ఒప్పందాన్ని రిలయన్స్ నిర్ధారించిన తరువాత అమెజాన్ డీల్  చర్చల్లో నిలిచింది. (రిలయన్స్ రిటైల్‌లో: కేకేఆర్ భారీ పెట్టుబడి)

కాగా రిలయన్స్ టెలికాం విభాగం జియోలో పెట్టుబడుల  సునామీ తరువాత తాజాగా రీటైల్ విభాగంగాపై  దృష్టిపెట్టారు  ఈ క్రమంలో ఇప్పటికే  అమెరికా ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్ రిలయన్స్ రిటైల్‌లో 1.75 శాతం వాటాను 7,500 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయనుంది. అలాగే కంపెనీలో బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులకు కేకేఆర్ చర్చలు జరుపుతోంది. దీంతోపాటు రిలయన్స్ రిటైల్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (ఏడీఐఐ), సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (పీఐఎఫ్) సహా, పలు కంపెనీలు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. (15 శాతం వాటాకు రూ. 63,000 కోట్లు!)

Advertisement
Advertisement