ఇది మామూలు ర్యాగింగ్‌ కాదుగా.. ఆ ఇంటి ఓనర్‌ పరిస్థితి ఏంటో? | Sakshi
Sakshi News home page

ఇది మామూలు ర్యాగింగ్‌ కాదుగా.. ఆ ఇంటి ఓనర్‌ పరిస్థితి ఏంటో?

Published Mon, Sep 4 2023 8:41 PM

Renting my 2 BHK in Indiranagar,viral Bengaluru man raises rent by Rs 10k within hours - Sakshi

నా డబుల్‌ బెడ్రూం ఫ్లాట్‌ను అద్దెకిస్తానంటూ ఓ ఇంటి యజమాని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అంతే ఆ పోస్ట్‌ క్షణాల్లో వైరల్‌ కావడంతో..నెటిజన్లు సైతం తమదైన స్టైల్లో కౌంటర్‌ ఇస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే? 

బెంగళూరులో ప్రముఖ ప్రాంతాలుగా పేరున్న ఇందిరానగర్‌కు చెందిన భరత్‌_ఎంజీ ఎక్స్‌.కామ్‌లో తన డబుల్‌ బెడ్రూం ఫ్లాట్‌లో ఉండేందుకు కిరాయి దారులు కావాలని పోస్ట్‌ చేశాడు. ఆ పోస్ట్‌లో ‘ఇందిరానగర్ 80 అడుగుల రోడ్డులో లేజీ సుజీ పక్కన ,12వ మెయిన్‌కి కుడివైపున నా 2 BHK ఫ్లాట్‌ని అద్దెకు ఇస్తున్నాను. ఇటీవలే ఇంటీరియర్స్‌ చేశారు. బెడ్‌రూమ్‌లో ప్రొజెక్టర్, మోటరైజ్డ్ స్క్రీన్‌తో హోమ్ థియేటర్ సెటప్ ఉంది. ఎలాంటి పరిమితులు లేవు. అక్టోబర్‌ 15 ఇంట్లో అద్దెకు జాయిన్‌ అవ్వొచ్చు. రెంట్‌ రూ. 45 వేలు, రెంట్‌కు ఇల్లు కావాలంటే డైరెక్ట్‌గా మెసేజ్‌ చేయండి’ అని పేర్కొంటూ ఆ ఇంటి ఫోటోల్ని జత చేశారు. 

మురిసి పోయి.. రెంటు పెంచేసి
అసలే ఇందిరా నగర్‌, పైగా చూడటానికి ఇల్లు బాగుంది. అద్దె ఇంటి కోసం వెతుకుతున్న వారు సైలెంట్‌గా ఉంటారా? ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ ఇంటి ఓనర్‌ పెట్టిన సోషల్‌ మీడియా పోస్ట్‌కి వందల మంది తమకు ఆ ఇల్లు అద్దెకు కావాలని రిప్లయి ఇచ్చారు. తాను పెట్టిన పోస్ట్‌కి ఊహించని స్పందన చూసిన యజమాని మురిసిపోయాడు. గంటలోనే అద్దె రూ.45 వేలు కాదని, రూ.55 వేలంటూ మరో పోస్ట్‌ పెట్టాడు. 

మా ఇంటిని అద్దెకిస్తున్నాం
దీంతో యాజమాని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు గట్టిగా కౌంటర్‌ ఇస్తూ ప్రపంచ దేశాల్లో ప్రముఖ మైన ఇళ్లను, ప్రభుత్వ కార్యాలయాల్ని అద్దె ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాం. రెంట్‌ ఎంతో చెబుతూ సెటైరికల్‌గా కొన్ని పోస్ట్‌లు పెట్టారు. ఆ పోస్ట్‌లు సైతం నెటిజన్లను అలరించడంతో.. ఇంటి ఓనర్‌ తిక్క కుదురుతుందిలే అంటూ కామెంట్లు చేస్తున్నారు. నెటిజన్లు పెట్టిన పోస్ట్‌లను చూసి అలరించండి

అయ్యో పాపం అనుకున్నారు
ఓ ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా చిన్న స్వామి స్టేడియంలో అతిన్ బోస్ అనే ఓ ప్రొడక్ట్ డిజైనర్ ‘ఇందిరానగర్ లో 2బీహెచ్ కే ఇంటి కోసం చూస్తున్నాను’ అని పేర్కొంటూ పింక్ ప్లకార్డుతో దర్శనమిచ్చాడు. ఇందిరా నగర్‌లో 2బీహెచ్‌కే బెడ్‌ రూంలో ఉంటున్నా. అద్దె రూ.35,000. ప్రస్తుతం నేను ఉంటున్న ఇంటి యజమాని అద్దెను ఒక్కసారిగా  60 శాతం పెంచేశాడు. ఇప్పుడు ఇందిరాగనర్ లో రూ.60 వేల లోపు అద్దెకు ఇల్లు లభించని పరిస్థితి ఉంది. రూ.80 వేలు పెట్టినా కష్టంగానే ఉంది’ అని బోస్ వాపోయాడు. అప్పట్లో అతిన్‌ బోస్‌ తీరుతో.. బెంగళూరులో అద్దె ఇల్లు దొరకడం ఇంత కష్టమా అంటూ నెటిజన్లు విస్మయానికి గురయ్యారు. ఇప్పుడు అదే నెటిజన్లు ఇంటి యజమానులు  గంటలోనే రెంటు రూ.10వేల పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీమ్స్‌ షేర్‌ చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement