Sakshi News home page

Revised I-T rules: ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌: ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నిబంధనల్లో మార్పులు.. భారీగా పన్ను ఆదా! 

Published Sat, Aug 19 2023 4:22 PM

Revised Income Tax rules tax relief to employees rent free accommodation - Sakshi

ప్రైవేటు ఉద్యోగులకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్‌ (CBDT) శుభవార్త అందించింది. కొన్ని ప్రైవేటు సం​స్థలు తమ ఉద్యోగుల్లో కొందరికి అద్దె రహిత వసతి కల్పిస్తుంటాయి. అలాంటి అద్దె రహిత ఇళ్లకు విధించే పన్నుకు సంబంధించి విలువను నిర్ణయించే నిబంధనలను సీబీడీటీ సవరించింది. దీంతో ఉద్యోగులకు మరింత ఎక్కువ పన్ను ఆదా అవుతుంది. టేక్-హోమ్ జీతం పెరుగుంది. 

సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఆదాయపు పన్ను నిబంధనలకు సవరణలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ నోటిఫై చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాకుండా ఇతర ఉద్యోగులకు యాజమాన్యాలు కల్పించే అన్‌ఫర్నిష్డ్‌ గృహాలకు సంబంధించిన వ్యాల్యుయేషన్‌ నిబంధనలు మారాయి.

తగ్గిన పన్నులు 
2011 జనాభా లెక్కల ప్రకారం 40 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో నివసించే ఉద్యోగులకు వసతిపై పన్ను వారి జీతంలో 10 శాతం ఉంటుంది. ఇది ఇంతకు మందు 15 శాతంగా ఉండేది. ఇక 15 లక్షలకు మించి 40 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల్లో ఇది జీతంలో 7.5 శాతం ఉంటుంది. గతంలో 10 శాతంగా ఉండేది. 

వసతి వ్యాల్యుయేషన్‌ నిబంధనలను సీబీడీటీ మార్చడం వల్ల అధిక జీతం పొందుతూ యాజమాన్యాలు కల్పించే వసతిలో నివాసముంటున్న ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుకుందని, పెద్ద పన్ను ఆదాతోపాటు వారు పొందే టేక్‌ హోమ్‌ జీతం పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇదీ చదవండి: లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం కడుతున్నారా? మెచ్యూరిటీ సొమ్ముపై పన్ను తప్పదు!

Advertisement

What’s your opinion

Advertisement