Amazon: అమెజాన్ వేర్‌హౌజ్‌లో రోబోలు! | Sakshi
Sakshi News home page

Amazon: అమెజాన్ వేర్‌హౌజ్‌లో రోబోలు!

Published Fri, Oct 20 2023 7:58 PM

Robots In Amazon Warehouse - Sakshi

అమెజాన్ సంస్థ తన వేర్‌హౌజ్‌ల్లో పని చేయడానికి హ్యుమనాయిడ్‌ రోబోలను ప్రవేశపెట్టింది. సంస్థ కార్యకలాపాల కోసం అమెరికాలోని ఓ వేర్‌హౌజ్‌లో వీటిని ప్రయోగాత్మకంగా తీసుకొచ్చినట్లు అమెజాన్‌ వెల్లడించింది. డిజి‌ట్ అనే రెండు కాళ్ల రోబో అవ‌లీల‌గా వ‌స్తువుల‌ను తీసుకుని లిఫ్ట్ చేస్తుందని అమెజాన్ చెప్పింది. డిజిట్ 5.9 అడుగులు. 65 కిలోల బ‌రువు ఉండి రెండు కాళ్ల‌తో న‌డుస్తుంది. ప్రస్తుతం వేర్‌హౌస్‌లో ఖాళీగా ఉన్న బాక్సుల‌ను త‌ర‌లించేందుకు ఈ రోబోలను వాడుతున్నారు.

ప్రస్తుతం అమెజాన్‌లో 15లక్షల మంది ఉద్యోగులు ఉ‍న్నారని, రోబోల ప్రవేశంతో వారి భరోసాపై ఎలాంటి ప్ర‌తికూల ప్ర‌భావం ఉండ‌ద‌ని కంపెనీ తెలిపింది. అయితే రోబోల ఎంట్రీతో కొన్ని ఉద్యోగాల అవ‌స‌రం లేకపోయానా, ఇవి కొత్త ఉద్యోగాల‌ను సృష్టిస్తాయ‌ని అమెజాన్ రోబోటిక్స్ చీఫ్ టెక్నాల‌జిస్ట్ టై బ్రాడీ పేర్కొన్నారు. 

ఇదిలా ఉండగా, ఆటోమేష‌న్‌పై అమెజాన్ ఉద్యోగులు ఆందోళ‌న చెందుతున్నారు. అమెజాన్ ఆటోమేష‌న్ ప్ర‌క్రియ వల్ల కొలువుల్లో కోత పడుతుందని ఆవేదన చెందుతున్నారు. ఇప్ప‌టికే ఫుల్‌ఫిల్‌మెంట్ సెంట‌ర్ల‌లో వంద‌లాది ఉద్యోగాలు కనుమరుగయ్యాయని బ్రిట‌న్ ట్రేడ్ యూనియ‌న్ జీఎంబీ నిర్వాహ‌కులు స్టువార్ట్ రిచ‌ర్డ్స్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇక డిజిట్ రోబోను ఆరేగాన్‌కు చెందిన స్టార్ట‌ప్ కంపెనీ అభివృద్ధి చేసింది.

Advertisement
Advertisement