Sakshi News home page

5జీ ఫోన్ల విక్రయాలపై శాంసంగ్‌ మరింత దృష్టి.. గెలాక్సీ ఎ54, ఎ34 విడుదల

Published Thu, Mar 30 2023 11:32 AM

samsung galaxy a54 a34 smartphones launch - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాల్లో 5జీ ఫోన్ల వాటాను మరింతగా పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు శాంసంగ్‌ ఇండియా జీఎం అక్షయ్‌ రావు తెలిపారు. ప్రస్తుతం విలువపరంగా వీటి వాటా 61 శాతంగా ఉందని 2023లో దీన్ని 75 శాతానికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు గెలాక్సీ ఎ సిరీస్‌లో రెండు కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించిన సందర్భంగా వివరించారు. వీటిలో ఎ54, ఎ34 మోడల్స్‌ ఉన్నాయి.

(రియల్‌మీ సి–55.. ఎంట్రీ లెవెల్‌ విభాగంలో సంచలనం!)

ఎ34 ధర రూ. 30, 999–రూ. 32,999గా ఉండగా, ఎ54 రేటు రూ. 38,999–40,999గా ఉంటుందని అక్షయ్‌ రావు చెప్పారు. ఆఫర్‌ కింద రూ. 3,000 క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. 8జీబీ+128 జీబీ లేదా 256 వేరియంట్లలో లభించే ఈ ఫోన్లకు 4 వరకు ఆండ్రాయిడ్‌ అప్‌డేట్లు, 5 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లు పొందవచ్చు. తమ పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం 25 స్మార్ట్‌ఫోన్లు ఉండగా .. వీటిలో 5జీ మోడల్స్‌ 16 ఉన్నాయని అక్షయ్‌ రావు పేర్కొన్నారు. వీటి ధర రూ. 14,000 నుంచి ప్రారంభమై రూ. 1.60 లక్షల వరకూ ఉందని చెప్పారు.

(మోటరోలా జీ13 వచ్చేసింది.. ధర తక్కువే!)

Advertisement

తప్పక చదవండి

Advertisement