మాల్యాకు ఈడీ షాక్‌, రూ.792 కోట్ల ఆస్తుల జప్తు

17 Jul, 2021 07:12 IST|Sakshi

న్యూఢిల్లీ: పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా రుణాల ఎగవేత కేసుకు సంబంధించి బ్యాంకులకు మరో రూ. 792 కోట్లు వసూలయ్యాయి. మనీ–ల్యాండరింగ్‌ నిరోధక చట్టం కింద మాల్యాకి చెందిన జప్తు చేసిన షేర్లలో కొన్నింటిని విక్రయించడంతో ఈ నిధులు వచ్చినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తెలిపింది. దీనితో దేశీయంగా రెండు అతి పెద్ద బ్యాంకు రుణాల మోసాల కేసుల్లో సుమారు 58 శాతం మొత్తాన్ని బ్యాంకులు, ప్రభుత్వం రికవర్‌ చేసుకున్నట్లవుతుందని పేర్కొంది.
కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌కి సంబంధించి రూ. 9,000 కోట్ల రుణాలను బ్యాంకులకు ఎగవేశారన్న ఆరోపణలతో మాల్యాపై విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్న ఆయన్ను భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును సుమారు రూ. 13,500 కోట్ల మేర మోసగించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ, ఆయన మేనమామ మెహుల్‌ చోక్సీలు కూడా ప్రస్తుతం విదేశాల్లోనే ఉన్నారు.  

చదవండి: BGMI : పబ్జీ గేమింగ్‌ లవర్స్‌కు బంపర్‌ ఆఫర్‌

 

మరిన్ని వార్తలు