Sensex At 200,000 In 10 Years Says Raamdeo Agarwal - Sakshi
Sakshi News home page

బుల్‌ రన్‌: రాందేవ్‌ అగర్వాల్‌ సంచలన అంచనాలు

Published Mon, May 31 2021 2:00 PM

Sensex at 200,000 in 10 years says Raamdeo Agrawal - Sakshi

సాక్షి,ముంబై:  కరోనా సంక్షోభ కాలంలో దేశీయ స్టాక్‌మార్కెట్లు శరవేగంగా దూసుకుపోతున్నాయి. మధ్యలో కొన్ని ఒడిదుడుకులున్నప్పటికీ  కీలక సూచీలు రెండూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్ నిపుణులలు స్టాక్‌మార్కెట్‌  వృద్ధిపై కీలక అంచనాలు వెలువరించారు. దలాల్‌ స్ట్రీట్‌లో బుల్‌ పరుగుకు ఇది ప్రారంభం మాత్రమేనని రానున్న కాలంలో సరికొత్త శిఖరాలను అధిరోహించడం ఖాయమని పేర్కొంటున్నారు.

బీఎస్‌ఈ సెన్సెక్స్ రాబోయే పదేళ్ళలో  ప్రస్తుత స్థాయినుంచి  నాలుగు రెట్లు పుంజుకోనుందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఎంఓఎఫ్ఎస్ఎల్) సహ వ్యవస్థాపకుడు, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రాందేవ్‌ అగర్వాల్ అంచనా వేశారు.  కొన్నేళ్లుగా కార్పొరేట్ రంగంలోఆరోగ్యకరమైన వృద్ధి, ఇతర డెమోగ్రాఫిక్స్‌ కారణంగా సెన్సెక్స్‌  200,000 మార్కును చేరుకుంటుందని అగర్వాల్ పేర్కొన్నారు. వార్షిక ప్రాతిపదికన కార్పొరేట్‌ లాభాలు 15 శాతం పెరుగుతాయన్నారు. 12-13 శాతం (నామమాత్ర దేశ స్థూల జాతీయోత్పత్తి)తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. కార్పొరేట్ లాభాల పెరుగుదలకు అనుగుణంగా మార్కెట్ రాబడి ముందుకు సాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గత పదేళ్లలో, ఎస్ అండ్ పి బీఎస్ఇ 10 శాతం సిఎజిఆర్ రిటర్న్ ఇచ్చిందన్నారు. మార్చి 2011 లో 19,445 స్థాయిల నుండి 2021 మార్చి నాటికి  49,509 స్థాయిలకు  సెన్సెక్స్‌ చేరుకుందని అగర్వాల్ చెప్పారు.  ఈ కాలంలో, భారత ఆర్థిక వ్యవస్థ 4 శాతం  సీఏజీఆర్‌ వృద్ధిని సాధించగా,  2010 లో 1.7 ట్రిలియన్ల నుండి 2020లో 2.6 ట్రిలియన్లకు పెరిగింది, చైనాతో పోలిస్తే ఇది 10 శాతం ఎక్కువ. అంతేకాదు  2029 నాటికి, భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.   ఈ కాలంలో మార్కెట్ డీమోనిటైజేషన్, ఐఎల్ఎఫ్ఎస్ కుంభకోణం,  కోవిడ్ వంటి సంక్షోభాలను ఎదుర్కొందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఇండియాలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఇన్వెస్టర్లకు సూచించారు.  వ్యూహాత్మక పెట్టుబడుల వైపు మళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే  ప్రభుత్వ రంగ సంస్థల్లోని తన హోల్డింగ్స్‌ను వేగంగా మళ్లించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వం  పెట్టుబడుల  ఉపసంహరణ ప్రక్రియ కోసం అన్ని 'దిగ్బంధనాలను' క్లియర్ చేయాలి, ఉద్యోగాల కల్పన , వృద్ధిపై దృష్టి పెట్టాలని అగర్వాల్‌ తెలిపారు. 

కాగా అగర్వాల్‌తో పాటు, మరికొందరు మార్కెట్ నిపుణులు ,పండితులు కూడా న్సెక్స్ కోసం ఆరు అంకెల స్థాయికి చేరుకోనుందని  అంచనావేయడం గమనార్హం. 2024 నాటికి  సెన్సెక్స్‌ లక్షమార్క్‌ను తాకుతుందని  ఇలియట్ వేవ్ ఇంటర్నేషనల్  మార్క్ గాలాసివ్స్కీ 2017 లోఅంచనా వేశారు. అప్పటికి సెన్సెక్స్‌ 30,750 స్థాయిలలో ఉంది. అలాగే 2020 నాటికి  100,000 మార్కును చేరుకుంటుందని, కార్వి పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసెస్ హెడ్ వరుణ్ గోయెల్ 2014 లో తెలిపారు. వీరితోపాటు ప్రముఖ ఈ‍క్విటీ పెట్టుబడి దారుడు రాకేశ్‌ ఝన్‌ఝన్‌ వాలా మదర్‌ ఆఫ్‌ బుల్‌ రన్‌ గా మార్కెట్ ర్యాలీని ఇదివరకే అభివర్ణించారు. 

చదవండి : కరోనా మూలాలు కనుక్కోండి: లేదంటే మరిన్ని మహమ్మారులు

Advertisement
Advertisement