లాభాలతో షురూ- అన్ని రంగాలూ ప్లస్‌ | Sakshi
Sakshi News home page

లాభాలతో షురూ- అన్ని రంగాలూ ప్లస్‌

Published Fri, Aug 14 2020 9:41 AM

Sensex double century- Auto weaken - Sakshi

ప్రపంచ సంకేతాలు అటూఇటుగా ఉన్నప్పటికీ దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 200 పాయింట్లు పెరిగి 38,510కు చేరింది. నిఫ్టీ 55 పాయింట్లు పుంజుకుని 11,355 వద్ద ట్రేడవుతోంది. గురువారం యూఎస్‌ ఇండెక్సులు ఎస్‌అండ్‌పీ, డోజోన్స్‌ 0.3 శాతం నీరసించగా.. నాస్‌డాక్‌ అదే స్థాయిలో లాభపడింది. ఇక ఆసియాలోనూ మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. అయితే దేశీయంగా బలపడ్డ సెంటిమెంటు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు.

ఆటో మాత్రమే
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ బలపడగా.. ఆటో 0.4 శాతం నీరసించింది. మీడియా, ఐటీ, బ్యాంకింగ్‌, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ 1.2-0.3 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో జీ, ఆర్‌ఐఎల్‌, సన్‌ ఫార్మా, ఎల్‌అండ్‌టీ, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, అదానీ పోర్ట్స్‌, శ్రీ సిమెంట్‌, యూపీఎల్‌, విప్రో, బ్రిటానియా 1.8-0.7 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే ఐషర్, హీరో మోటో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, పవర్‌గ్రిడ్‌, టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌ 2-0.5 శాతం మధ్య క్షీణించాయి.

ఆటో అటూఇటూ..
డెరివేటివ్స్‌లో ఎస్కార్ట్స్‌, అశోక్‌ లేలాండ్‌, అమరరాజా, ముత్తూట్‌ ఫైనాన్స్‌, గ్లెన్‌మార్క్‌, మెక్‌డోవెల్‌, పేజ్‌, నిట్‌టెక్‌, అరబిందో 3.2-1.3 శాతం మధ్య ఎగశాయి. కాగా.. మరోపక్క ఇండిగో, భారత్‌ ఫోర్జ్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, బాష్‌, టీవీఎస్‌ మోటార్‌, పీఎఫ్‌సీ, ఐబీ హౌసింగ్‌, పెట్రోనెట్‌, ఆర్‌బీఎల్‌ 3-1 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్‌ఈలో స్మాల్‌ క్యాప్‌ 0.6 శాతం బలపడింది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1126 లాభపడగా.. 619 నష్టాలతో కదులుతున్నాయి.

Advertisement
Advertisement