నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్! | Sakshi
Sakshi News home page

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్!

Published Tue, Nov 30 2021 4:01 PM

Sensex ends 195 pts lower at 57064, Nifty gives up 17000 on closing bell - Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిశాయి. దేశంలో ప్రత్యక్ష పన్ను నికర వసూళ్లు గణనీయంగా పెరగడంతో ఉదయం సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఆందోళనలు, ఆసియా మార్కెట్లు నష్టాల భయాల నేపథ్యంలో సూచీలు ఒక్కసారిగా కుప్పకూలాయి. తర్వాత కోలుకున్నప్పటికీ బలమైన సంకేతాలు లేకపోవడంతో ఊగిసలాట దొరణి కనబరిచాయి. చివరి అరగంటలో అమ్మకాలు వెల్లువెత్తడంతో భారీ నష్టాలు తప్పలేదు. చివరకు, సెన్సెక్స్ 195.71 పాయింట్లు (0.34%) క్షీణించి 57064.87 వద్ద ఉంటే, నిఫ్టీ 81.40 పాయింట్లు (0.48%) నష్టపోయి 16972.60 వద్ద ముగిసింది.

నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.13వద్ద ఉంది. నిఫ్టీలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, శ్రీ సిమెంట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫినాన్స్ షేర్లు భారీగా లాభాలను పొందితే.. టాటా స్టీల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఆటో, ఇండస్‌ ఇండ్ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఎంఅండ్‌ఎం షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. మెటల్ ఇండెక్స్ రంగాలలో సూచీలు 2 శాతానికి పైగా పడిపోయింది. బ్యాంకులు, ఆటో & విద్యుత్, ఐటీ, రియాల్టీ, ఎఫ్ఎంసీజీ రంగాలు లాభాల్లో ముగిశాయి. 

(చదవండి: టెస్లాకు గట్టి పోటీ.. ఛార్జింగ్ లేకున్నా దూసుకెళ్తుంది!)

Advertisement
Advertisement